Tuesday, October 19, 2010

ముచ్చటగా మూడో సారి జంటగా నటించబోతున్న "వెంకటేష్ నయనతార"..


గత కొద్ది నెలలుగా వెంకటేష్  మళయాళంలో హిట్టయిన బాడీగార్డ్ చిత్రం రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అవి రూమర్స్ అని కొట్టిపారేసారు. కానీ త్వరలో ఆ చిత్రం మొదలయ్యేటట్లుంది. ప్రస్తుతం కన్నడ చిత్రం 'ఆప్త రక్షక' రీమేక్ చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో మళయాళ చిత్రం రీమేక్ ని ఓకే చేసినట్లు సమాచారం.అలాగే దర్సకుడుగా ఒరిజినల్ దర్శకుడు సిద్దిక్ చేయనున్నారు. అలాగే హీరోయిన్ గా నయనతార నే ఫిక్స్ చేయనున్నారు. గీతా చిత్ర ప్రొడక్షన్స్..శివరాజు ఈ చిత్రం నిర్మించనుననున్నారు. శివరాజు గతంలో వెంకటేష్ తో పెళ్ళి చేసుకుందాం, పవిత్రబంధం చిత్రాలు నిర్మించారు.ఇక బాడీగార్డ్ చిత్రం మళయాళ దర్శకుడు సిద్దిక్ దర్సకత్వంలో రూపొందింది. దిలీప్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాదించింది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం రీమేక్ చేయాలా వద్దా అని వెంకటేష్ సంశయిస్తున్నారు. అయితే తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ ని చేస్తూండటంతో వెంకటేష్ సైతం ఆసక్తి చూపటానికి కారణమని చెప్తున్నారు. 'మై లవ్‌ స్టోరీ' అనే పేరుతో హిందీలో ఈ సినిమా రీమేక్‌ అవుతోంది.

No comments: