మొదట ఆవరేజ్ టాక్ తర్వాత అట్టర్ ప్లాప్ అయిన కొమరం పులి, సినిమాతో కూడా 30కోట్లు కొల్లగొట్టాడని అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వెబ్ సైట్లు ‘దటీజ్ పవర్ స్టార్’ అంటూ ఊదరగొట్టేస్తున్నాయి. అయితే కలెక్షన్ల లెక్కలు, తెలుగు సినిమా మార్కెట్ గురించి తెలియని వాళ్లే అలాంటి పిచ్చి రాతల్ని నమ్మాలి. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ గురించి ఎవరికీ రాబట్టగలవారిలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు.
అయితే డిజాస్టర్ సినిమాతో 30 కోట్లు రాబట్టేంత సీన్ అయితే అతనికి లేదు. ‘పులి’ చిత్రానికి తొలివారంలో ఘనమైన వసూల్లు వచ్చినా ఆ తర్వాత చల్లబడిపోయింది. ‘రోబో’, ‘ఖలేజా’ చిత్రాలతో చాలా కేంద్రాల్లో అవుట్ అయిపోయింది. ఓవరాల్ గా 19 నుండి 20కోట్ల షేర్ రాబట్టుకుని సరిపెట్టుకుంది. అంతటి డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి కూడా ఇలాంటి వసూళ్లు రావడమంటే మాటలు కాదు. ఇంతటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఇక హిట్ సినిమా వస్తే ఎలా ఉంటుందనేది ఊహలకి కూడా అందదు.
ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న మరో తాజా చిత్రాల గురించి చర్చలు సాగుతున్నాయి. ‘లవ్ ఆజ్ కల్’ తెలుగు రీమేక్ ‘ఖుషీగా’లోనూ, ఏసు ప్రభు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న చిత్రంలోనూ పవన్ నటిస్తున్నాడు. ‘లవ్ ఆజ్ కల్’ కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి పెద్ద చర్చలు జరగడంలేదు. కానీ, ఏసు ప్రభువు జీవిత చరిత్రతో తీస్తున్న చిత్రం గురించి మాత్రం అంచనాలు ఉన్నాయి. ఆ ఏసు ప్రభువు ఖచ్చితంగా పవన్‌కు సక్సెస్ ఇచ్చి కాపాడతాడా? అని మాట్లాడుకుంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు....
No comments:
Post a Comment