మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా భారీ స్ధాయిలో విజయం సాధించిందని మీడియాలో ఓ ప్రక్క ఊదరకొడుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క మహేష్ బాబు ...తాజాగా ఇదే విషయంపై ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేసిందేమిటంటే...ఖలేజా చిత్రం భాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. అలాగే ఈ చిత్రం నన్ను నటుడుగా బాగా తృప్తిపరిచింది. నా ప్రెండ్ త్రివిక్రమ్ కి అలాగే ఎమోజింగ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ కి, ఖలేజా మొత్తం యూనిట్ కి బిగ్ ధాంక్స్. వీరితో పాటు నాకు ఇంత విజయం అందించిన నా యు.ఎస్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే రిపోర్ట్ ల ప్రకారం అక్కడ ఎక్కువ కలెక్టు చేసిన తెలుగు సినిమా ఇదే అంటూ ట్వీట్ చేసారు. ఇంత ట్విట్టర్ మెసేజ్ లోనూ భారీగా డబ్బులు గుమ్మరించి చిత్రం నిర్మించిన నిర్మాత శింగనమల రమేష్ పేరుని మహేష్ ఎక్కడా ప్రస్దావించ లేదు.
No comments:
Post a Comment