Saturday, October 16, 2010

"తెలుగు" బాగుకోసం కృషి చేస్తున్న ఒకేఒక్క తెలుగు న్యూస్ ఛానల్....



తెలుగు ప్రపంచంలో మొదటి పది బాషలలో ఒక్కటి.....ఇది సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి చెప్పిన మాట.కానీ మనం మాత్రం "ఇంగ్లీష్" అంటూ మన తెలుగు తల్లిని ఎగతాళి  చేస్తున్నాం........

తెలుగు మీడియాలో తెలుగు బాష నీ బాగుకోసం కృషిచేస్తున్న ఛానల్ ఉంది అంటే ఆది ఒకేఒక్క ఛానల్ రామోజిగారి సంస్థ నుంచి వచ్చిన "ఈటీవీ 2".మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం......

టీవీ9.....ఎన్ టీవీ.....టీవీ5....ఐ న్యూస్...సాక్షిటీవీ.....నిన్న గాక మొన్న వచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిఛానల్ కూడా ఆంగ్ల మాధ్యమం లో జోగుతున్నాయి......కానీ "ఈటీవీ 2" మాత్రం తెలుగు కోసం కృషిచేస్తుంది......

తెలుగు బాష మీద ఒక్కటి అంటే ఒక్క కార్యక్రమం ప్రసారం చేస్తున్నర మన తెలుగు న్యూస్ చానల్స్ లో......? కానీ "తెలుగు వెలుగు" అనే చక్కని స్వచ్చమయిన తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ నీ ప్రపంచ మీడియా పటం లో చూపిస్తుంది.....

మొన్నటికి మొన్న.....టీవీ9 లో తెలుగు నీ ఎంత కుని చేస్తున్నారు అంటే...."ఎస్పి బలసుబ్రమన్యంబవయుక్తంగా చక్కగా పాడారు  అంది...." నేను మా అమ్మ చూస్తున్న వాళ్ళం ఒక్క క్షణం నిర్దంతా పోయాం.....ఏంటి బాలు గారి మరదలు టీవీ ఛానల్ లో యాంకర్ గా చేస్తుంద అని.....కానీ వినగా వినగా అప్పుడు అర్ధం అయింది "బావయుక్తం కీ వచ్చిన పాట్లు అని..." 

తెలుగు నీ తెలుగు గ పలకండి....అంటే కానీ ఇలా కూనీ చేయకండి....

2 comments:

విజయ క్రాంతి said...

తెలుగు ఖూని చేస్తున్నారంటూ , మీరు రాయటం బాగానే వున్నా మీరు రాస్తున్న తప్పులు చాల వున్నాయి .దయచేసి ఒకటికి రెండు సార్లు సరి చేసి చూసుకొని పోస్ట్ పెట్టండి . ఇలా తప్పుల తడకల రాస్తూ వుంటే ఎలా ?

క్షమించండి కేవలం ఒక సలహా మాత్రమె ..

Anonymous said...

బావయుక్తంగా కాదండి భావయుక్తంగా