Wednesday, October 27, 2010
'అల్లరి' రవిబాబు మనసారా చేస్తున్న చిత్రం విశేషాలు...
ఆ మధ్యన అనసూయ, అమరావతి అంటూ హర్రర్ లాంటి ధ్రిల్లర్ లతో అదరకొట్టిన 'అల్లరి' రవిబాబు తాజాగా ఓ ప్రేమ కథను తెరకెక్కించారు. ఈ చిత్రానికి 'మనసారా' అనే టైటిల్ పెట్టాడు. ఉషాకిరణ్ వారికి రూపొందించి ఇచ్చిన 'నచ్చావులే' తరహా టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. నచ్చావులే చిత్రంలో కొత్త జంటను పరిచయం చేసినట్లే ఈ తాజా చిత్రంలో కూడా విక్రమ్, దియా అనే జంటను తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఇటీవల మధుర మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. కేరళ నేపధ్యంలో నడిచే ఈ ప్రేమ కధకు శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించాడు. చాలా చిన్న బడ్జెట్ లో మనస్సుకు హత్తుకునేలా ఈ లవ్ స్టోరీని చిత్రీకరించాడని, మళ్ళీ తన మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నాడని అంతటా వినిపిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment