Monday, October 18, 2010

టాలీవుడ్ లో కుర్చీకోసం కొట్టుకుంటున్న ఆ ఇద్దరు హీరోయిన్స్



తెలుగు సినీ రంగంలో టాప్ చైర్ కోసం హీరోయిన్లు అనుష్క , కాజల్ పోటీ పడుతున్నారు.అరుంధతి సినిమా ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క, మగధీర సినిమా ద్వారా ఆ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కాజల్ హీరోయిన్లలో అగ్రస్థానం కోసం అర్రులు చాస్తున్నారు. విక్రమార్క సినిమా ద్వారా అనుష్క ఓ ఇమేజ్ ను సొంతం చేసుకోగా, కాజల్ చందమామతో ఆ ఇమేజ్ సంపాదించుకుంది. ఇద్దరు కూడా ఏడాది పాటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆఫర్లు ఇద్దరికి కూడా పోటీ పడి వస్తున్నాయి. రెండేళ్ల పాటు అనుష్కకు హిట్ లేదు. అయినా ఆమె రెమ్యునరేషన్ కోటి రూపాయల నుంచి పైసా కూడా తగ్గలేదని చెబుతున్నారు. కాజల్ రెమ్యునరేషన్ దృష్ట్యా అనుష్క కన్నా వెనకబడే ఉంది. కాజల్ కూడా హిట్లు అంతంత మాత్రంగానే ఇస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాలు ఆడుతున్నారు. మహేష్ ఖలేజా అనుష్కకు అంతగా సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. జూనియర్ఎన్టీఆర్ నటించిన బృందావనం కాజల్ కు సక్సెస్ ను సొంతం చేసినట్లే.సూపర్ సినిమా ద్వారా అనుష్క, లక్ష్మీకళ్యాణం సినిమా ద్వారా కాజల్ సినీరంగ ప్రవేశం చేశారు. అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనుష్క పెట్టింది పేరుగా మారింది. అయితే, ఆ తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమా పంచాక్షరి ఆమెకు నిరాశనే మిగిల్చింది. బిల్లా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాజల్ కూడా ఫ్లాప్ ల్లో తక్కువేమీ తినలేదు. ఆర్య2, గణేష్, ఓం శాంతి సినిమాలు కాజల్ కు పూర్తిగా నిరాశనే పంచిపెట్టాయి. అయినా, వీరిద్దరికీ ఆఫర్ల విషయంలో ఢోకా లేదు.....
comemnt cheyadam marchipokandi.....

1 comment:

Anonymous said...

Anushka ni No1 not kajal ,kajal ki avkasalu nagababu reference tho vache padaye (magadheera,arya2,orang)
but anushkaki ala kadu...........