నయనతార షూటింగ్ చేస్తున్న ఆ ‘షాపింగ్ మాల్’కి ఏదో పని మీద రజనీకాంత్ వెళ్లారట. నయనతార అదే మాల్ లో ఉన్న సంగతి తెలుసుకుని ఆమెను పలకరించడానికి షూటింగ్ స్పాట్ లోకి అడుగుపెట్టారు. ఆయన సరసన నయనతార ‘చంద్రముఖి’, ‘కుశేలన్’లో నటించిన విషయం విదితమే. నయనతార ప్రవర్తన, ఆమె ప్రతిభ పట్ల రజనీకాంత్ కు మంచి అభిప్రాయం ఉంది. నయనతారను కలిసి ‘ఆరోగ్యం బాగుందా? కుశలమే కదా’ అని అడిగి రజనీకాంత్ వెనుతిరిగారట.
సూపర్ స్టార్ వెళ్లిపోయిన తర్వాత నయనతారతో పాటు ఇతర యూనిట్ సభ్యులు రజనీకాంత్ నిరాడంబతరను కొనియాడకుండా ఉండలేకపోయారని సమాచారం. మాములుగా ఇండియన్ హీరోలు ఓ లెవల్ మెయిన్ టైన్ చేస్తారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. హీరోయిన్ ని స్వయంగా వెళ్లి పలకరిస్తే తమ రేంజ్ తగ్గుతుందన్న అభిప్రాయం కొంతమంది హీరోలకు ఉంది. రజనీకాంత్ మాత్రం తన స్థాయిని దృష్టిలో పెట్టుకోకుండా నయనతారను కలిసి, ఆత్మీయంగా పలకరించి వెళ్లడం అభినందించదగ్గ విషయం.
No comments:
Post a Comment