రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" విడుదల సందర్భంగా టీవీ ఛానెల్స్ వారు చర్చవేదిక పెట్టారు. అందులో భాగంగా ఓ పాపులర్ టీవీ ఛానెల్ వారు పీఆర్పీ శోభారాణిని చర్చకు ఆహ్వానించారు. ఆమె తన తరహాలో మాట్లాడుతూ..రామ్ గోపాల్ వర్మ ఆంద్రా ప్రజల మనోభావాలు డామేజ్ చేసే విధంగా స్టుపిడ్ చిత్రాలు తీస్తున్నారని, అందులో రక్త చరిత్ర ఒకటని అన్నారు. అలా తాను అనటానికి కారణం..ఇలాంటి సినిమాలు పిల్లల మనస్సులపై తీవ్రమైన ప్రభావం చూపి వారిని రౌడీ షీటర్లుగా మారుస్తాయంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ఆమె లెక్చర్ పూర్తయిన తర్వాత వర్మను లైన్ లోకి తీసుకున్నారు. ఆయన ఆవలిస్తూ..ఆవిడ మాట్లాడుతుంటే నిద్రవచ్చిందని, ఎట్లా ఆమెను భర్త బేర్ చేస్తున్నారని వ్యగ్యంగా అన్నారు. వెంటనే శోభారాణి..రామ్ గోపాల్ వర్మని దుమ్మెత్తిపోస్తూ..ఆయన తెలుగు మహిళలను అవమానపరుస్తున్నారని, ఇది తెలుగు జాతి గర్హించాల్సిన విషయమని, ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. దానికి రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు.
దీనిపై మీ స్పందన కామెంట్ రూపంలో రాయండి.....
దీనిపై మీ స్పందన కామెంట్ రూపంలో రాయండి.....
No comments:
Post a Comment