Tuesday, November 9, 2010

రాంగోపాల్ వర్మ తాట తీస్తాం అంటున్న చిరు అభిమానులు...



దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగా స్టార్ చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవిపై వ్యంగ్యాస్త్తాలు విసురుతూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో రాశాడు. బాధితులను పరామర్సించడానికి బదులు మెగా హీరో విలన్ జల్ తుఫానుకు ఓ పంచ్ ఇవ్వాలని వర్మ ఓ విసురు విసిరాడు. అది వ్యంగ్యమా, కాదా అనే విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి అభిమానులు మాత్రం వర్మపై గుర్రుమంటున్నారు. వర్మ తన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని, లేకుంటే తాము చేయాల్సింది చేస్తామని అంటున్నారు. వర్మ వివరణ కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు. కాగా, చిరంజీవి వరద బాధితుల పరామర్శ కూడా వెరైటీగా సాగుతోంది. చేపలు పట్టడం, పడవ ప్రయాణాలు చేయడం - ఇలా ప్రత్యేకంగా ఆయన వరద ప్రాంతాల యాత్ర సాగుతోంది....

No comments: