తనకు విడాకు లివ్వకుండానే తన భర్త ప్రభుదేవాతో నయనతార పబ్లిగ్గా తిరుగుతుండడాన్ని సవాలు చేస్తూ ప్రభుదేవా భార్య రామ్‌లత్ కోర్టులో కేసు వేయడం తెలిసిందే. ఈ విషయమై విచారించేందుకుగాను ప్రభుదేవా- నయనతారలను హాజరు కావాల్సిందిగా చెన్నయిలోని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుదేవా కానీ నయనతార కానీ కోర్టుకు హాజరు కాలేదు. దాంతో నడిగర సంఘంగా పిలువబడే తమిళ నటీనటుల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. వారిద్దరూ కోర్టుకు హాజరయ్యేలా చూడాలని నడిగర సంఘాన్ని ఆదేశించింది. దాంతో నడిగర సంఘం వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోకపోతే.. తమ సంఘం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది!
No comments:
Post a Comment