ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ ఈ ఏడాదే విడుదలై విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘సింహా’ అంతకుమించిన విజయం నమోదు చేసింది. మళ్లీ ఇదే ఏడాది ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ కూడా విజయం సాధిస్తోంది. ‘అమరావతి’ చిత్రానికిగాను ‘ఉత్తమ ప్రతినాయకుడు’గా నందమూరి తారకరత్న ప్రతిష్టాత్మక నంది అవార్డునందుకున్నారు. కనుక నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న ‘కత్తి’ చిత్రం కూడా కత్తిలాంటి విజయం సాధించడం ఖాయం’ అన్నారు వక్తలంతా. నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయనిర్మాణంలో రూపొందిస్తున్న ‘కత్తి’ చిత్రం ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక నందమూరి అభిమానుల కోలాహాలం మధ్య ఘనంగా జరిగింది. దాసరి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, జానకిరామ్, కిక్ శ్యామ్, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, సనాఖాన్ (చిత్ర కథానాయిక), చిత్ర దర్శకుడు మల్లికార్జున్, గౌతంరాజు, వక్కంతం వంశీ (కథ), ఆర్పీ పట్నాయక్, దర్శకుడు శ్రీవాస్, గీత రచయితలు రామజోగయ్య శాస్ర్తి, బండారు దానయ్య తదితరులు పాల్గొన్నారు....
ముఖ్య అతిధి డాదాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘చిత్రసీమ ప్రభ ఉన్నంత కాలం నందమూరి ప్రభ ఉంటుంది. ప్రస్తుతం నిర్మాతల్లేరు. కాంబినేషన్ సెట్టర్స్, ప్రపోజల్ మేకర్స్, వసతులు కల్పించేవారే పరిశ్రమలో ఉన్నారు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ ఆర్ట్‌స పనిచేస్తోంది. ప్రస్తుత యువతలో నిర్మాత, నటుడుగా నిలిచిన వ్యక్తి కళ్యాణ్‌రామ్. అన్నిటా..పట్టుదలగా ఉంటాడు. ఈ చిత్రం విజయం సాధించాలి. కత్తిలాంటి కుర్రాడి కథకి ‘కత్తి’ టైటిల్ సరైనదే’ అన్నారు. కత్తి ఈనెల 12న విడుదలవుతోంది.
No comments:
Post a Comment