‘రోబో’ చిత్రం హిట్టయింది.కానీ "రోబో" సినిమా మీద రెండు చిన్న విషయాలను మాత్రం ప్రస్తావిస్తాను. ఒకటి హాస్యాస్పదమైన విషయమైతే రెండోది శోచనీయమైన విషయం.దాని మీద మీరు మీ అబిప్రాయాలు చెప్పండి...పూర్తిగా అర్ధం చేసుకొని రాయాలి సుమ! కామెంట్. రోబో హీరోయిన్ ఆ చిత్రం ప్రమోషన్ ఫంక్షన్‌లో డైరక్ట్ తెలుగు సినిమాలో నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చింది. బాగుంది. రోబోలకు మనసును ఇన్‌స్టాల్ చేయడం సాధ్యమేనా? రోబోలు మనుషుల్లా ఆలోచించగలుగుతాయా?-తనంత తాను నిర్ణయాలు తీసుకోగలుగుతాయా?
ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకుని సినిమాను అంతర్జాతీయ స్థాయికి సరిదీటుగా నిర్మించారు. ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు నేను చర్చించదలుచుకోలేదు.
రెండు చిన్న విషయాలను మాత్రం ప్రస్తావిస్తాను. ఒకటి హాస్యాస్పదమైన విషయమైతే రెండోది శోచనీయమైన విషయం.
మొదటిది నొప్పులు పడుతున్న ఒక గర్భిణి గురించి. తల్లీ, బిడ్డ-ఇద్దరిలో ఏ ఒక్కరిని కూడా బతికించలేమేమో అని డాక్టర్లు ఆందోళన పడుతున్న సమయంలో రోబో ఆమెకు సుఖ ప్రసవసం చేస్తుంది. ఆ స్ర్తి తన భర్తను కార్గిల్ వార్‌లో పోగొట్టుకున్నట్టు హీరోయిన్ చెబుతుంది. ఆమె కొడుకు 2010లో పుడతాడు (!) కార్గిల్ వార్‌లో మరణించిన భర్త వలన కలగబోయే ఆ పిల్లాడిమీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుని ఈరోజు వరకూ ఎదురు చూస్తోందట(?)
ఈ ప్రశ్నకి సదరు డైరెక్టర్ గారు ఎం జవాబు చెబుతారు....సైన్సు చరిత్రలోనే ఎక్కువ రోజులు పిండాన్ని మోసిన గణత ఆమెధీ అవుతుందా...ఎప్పుడూ కార్గిల్ వార్...మరి 2010 లో ప్రసవం....బాగుంది కదా మీరు చెప్పండి కామెంట్ రూపం లో....
రెండవది- ఒక పెద్ద భవనంలో మంటలు చెలరేగినప్పుడు రోబో ఆ భవనంలో ఇరుక్కుపోయినవారిని కాపాడుతుంది. ఒక అమ్మాయి స్నానం చేస్తూ బయటికి రాలేక అక్కడే ఉండిపోతుంది. ‘నా ఒంటిమీద బట్టలు లేవు’ అని ఆ అమ్మాయి గోలపెడుతున్నా పట్టించుకోకుండా రోబో ఆ అమ్మాయిని బయటికి తీసుకు వస్తుంది. మీడియా జనం ఎగబడి ఆ అమ్మాయి ఫోటోలు తీస్తారు. ఆ అమ్మాయి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి వేగంగా వస్తున్న లారీ కింద పడి మరణిస్తుంది. తనను పదిమంది నగ్నంగా చూడడాన్ని అవమానంగా భావించి ఓ మధ్యతరగతి లేక కింది తరగతి స్ర్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన దర్శకుడు హీరోయిన్‌ని మాత్రం వీలైనంత ఎక్కువ అంగప్రదర్శనతో, సాధ్యమైనంత తక్కువ బట్టలతో చూపించారు.
శరీరంమీద అక్కడక్కడ గుడ్డపీలికలు అతికించుకుని హీరోయిన్ గంతులెయ్యడం సినిమాకు కాసుల వర్షం కురిపించే స్పెషల్ ఎట్రాక్షన్!
సినిమాలకు సమాజ విలువలతో పనిలేదా?
సినిమాలకు సమాజ విలువలతో పనిలేదా?
2 comments:
mundu movie sariga chusi post raayi akkada aishwarya rai " PELLAINA KOTHALONE THANA HUSBAND MILITARY LO CHANIPOYADU " ani antundi kaani kargil ane name asalu raadu
మహాశయా....
తమరికి తెలుసో లేదో కాని, కార్గిల్ లో ప్రతిరోజు వార్ జరుగుతుంది...
దర్శకుడి ఉద్దేశ్యం అదే కాని ఎప్పుడో దశాబ్దం క్రితం జరిగిన వార్ లో చనిపోయాడని కాదు మహాప్రబో
Post a Comment