చెల్లి సెంటిమెంట్ తో తయాచేసిన "కత్తి".....
ఈ "కత్తి" కీ యాక్షన్ అనే మందు కూడా పూసారు....
Final Analysis : చెల్లి చూస్తే కర్చీఫ్ అందుకుంటుంది....అన్న చూస్తే "కట్టి" అందుకుంటాడు....ఈ రెండు కానివాళ్ళు చూస్తే "ఏడుపు" అందుకుంటారు.....
రామకృష్ణ ఒక ఫుట్ బాల్ ప్లేయర్.అతనికి తండ్రి,ఇద్దరు పెళ్ళయిన అన్నలు,ఒక చెల్లెలూ ఉంటారు.చెల్లి హారిక అంటే రామకృష్ణ కు ప్రాణం.ఆమె చేసే అన్ని తప్పుల్నీ అతను కవర్ చేస్తూ ఉంటాడు.ఆమె ఉన్నట్టుండి ఆమె పెళ్ళి చూపులు జరిగేరోజు నుంచీ కనపడకుండా పోతుంది.ఆమెను కిక్ శ్యామ్ తన అనుచరులతో కలసి వెంటాడుతుండగా,ఆమెను రైల్లోకి లాగి కాపాడతాడు రామకృష్ణ.ఇక్కడ ఇంటర్వెల్.అప్పుడామె తాను కిక్ శ్యామ్ తో పరిచయం ఎలా జరిగిందీ,అతన్ని ఎలా ప్రేమించిందీ,అతను పెళ్ళిచేసుకుని వాళ్ళఊరు తీసుకెళితే అక్కడ ఏమ జరిగిందో అన్నయ్యకు చెప్పుకుని "చిన్నప్పటి నుంచీ చాలా తప్పులు కాసావు.ఈ ఒక్క తప్పు కాసి నన్ను మనింటికి తీసుకెళ్ళన్నయ్యా" అంటూంది. దానికి ఆ అన్నయ్య ఏం చేశాడు...?ఎలా చెల్లి కాపురాన్ని తీర్చిదిద్దాడన్నది మిగిలిన కథ.
ఈ చిత్రానికి హీరో,నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి పరిణితితో న్యాయం చేశాడు.చెల్లితో సెంటిమెంట్ సీన్లలో చక్కని నటన కనపరిచాడు.ఇక రౌద్రరసంలో అతని కళ్ళు నిప్పులు కురిపించాయని చెప్పొచ్చు.ఇక డ్యాన్సుల్లో"నాటు కోడి పులుసు"పాటలో ఒంటిచేత్తో ఎగిరి వేసిన స్టెప్పుకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ఒక విధంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోశాదని చెప్పొచ్చు.ఈ చిత్రంతో ఆల్ రౌండ్ ప్రతిభ కనపరిచాడు కళ్యాణ్ రామ్.ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణపు విలువలు కూడా చాలా బాగున్నాయి.హీరోయిన్ సనాఖాన్ కి పెద్దగా నటించేందుకు ఏం లేదు.సెంటిమెంట్ సీన్లలో శరణ్య నటన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోట శ్రీనివాసరావు నటన గురించి.ముత్యం పాత్రలో కోట నటన బహుధా ప్రశంసనీయం.అతని డైలాగ్ మాడ్యులేషన్,నటన,ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మానందం కామెడీ పండింది.ధర్మవరపు పాత్ర కూడా హీరో పాత్ర ఎలివేషన్ కు బాగానే దోహదపడింది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
గతంలో అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తో అనేక సినిమాలు,ఆనాటి "రక్తసంబంధం" నుంచి నిన్న మొన్నటి "అన్నవరం"వరకూ అనేక చిత్రాలు అలాటి కథలతో వచ్చాయి.ఇది కూడా అలాంటి చిత్రమే.కాకపోతే ట్రీట్ మెంట్ కాస్త విభిన్నంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు.
కామెంట్ చేయండి బాబు......
2 comments:
కత్తికి సాన పట్టారా బాబు?మా వైపు రిలీజు కాలేదూ??
Mr. Editor ji,
Your blog is FULL of virus. And some of them are more vulnerable that includes hacking passwords. Do you know this? I had seen ppl hanging around your site already requeste you, but no use. Please take necessary actions.
****
I dont want to casting down your hunch in sharing, bt rather informative to help you.
Chill out :))
Post a Comment