Friday, November 12, 2010

ఏమైయింది ఈవేళ..... MOVIE REVIEW

నేటి మానవ సంబందాల్లో కోల్పోతున్న నిజం ఏమైయింది ఈవేళ.....

ఒక్క హిట్ తో ఇరగాపడిపోయి ఫ్లాప్ వచ్చేసరికి డిలపడిపోయిన వరుణ్ సందేశ్ ఈ సారి నటన మీద దృష్టిపెట్టి వొళ్ళు వంచాడు....బాగానే చేసాడు....

అక్క ప్రస్తుతం టాలీవుడ్ నీ దున్నేస్తుంటే...చెల్లి సైలెంట్ గా చాప కింద నీరు ల అవకాశలు అందిప్చుకుంటుంది.....మొదటి సినిమా లోనే నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు మెచ్చుకోవాలి....అంత అక్క ట్రైనింగ్....రేపు అక్క బాలీవుడ్ చెక్కేస్తే టాలీవుడ్ వొంటరి అయిపోకుడదు అని చెల్లి నీ దింపింది.....

అవంతిక(నిషాఅగర్వాల్) తను యువ (శశాంక్)తో రెండో పెళ్ళి చూపుల కోసం ఒక రెస్టారెంట్లో కలుస్తుంది.అదే పని మీద శీను (వరుణ్ సందేశ్) కూడా నిమిష (నిషా షా)ను కలుస్తాడు ఒక పార్క్ లో.అవంతిక తన మొదటి పెళ్ళి ఎలా జరిగింది అన్నది యువకు చెపుతూంటే,తన మొదటి పెళ్ళి ఎలా జరిగిందో తమ మధ్య ఎలా పరిచయం అయ్యిందో,ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందో,వారి పెళ్ళి పెద్దల అంగీకారం లేకుండా ఎలా జరిగిందో,ఆ తర్వాత తమకు విభేదాలెలా వచ్చాయో,ఎలా విడిపోయారో నిమిషకు కూలంకషంగా ఏదీ దాచకుండా చెపుతాడు శీను.ఆఖరికి తామిద్దరూ పెళ్ళికి ముందే శారీరకంగా ఏలా కలిసిందీ కూడా కలిపి.తీరా చూస్తే అవంతిక,శీను ఇద్దరు గతంలో విడిపోయిన భార్యాభర్తలు.తను చేసుకోబోయే అమ్మాయి వేరే వాడితో శారీరకంగా కలిసిందన్న తర్వాత అవంతిక మీద యువ భావాల్లో మార్పు వస్తుంది.అదే ఫీలింగ్ నిమిషకు కూడా శీను మీద కలుగుతుంది.యువను అవంతిక,నిమిషను శీను పెళ్ళిచేసుకున్నారా...?చివరికి ఏమయ్యిందనేది మిగిలిన కథ.

ఇది నేటి తరాన్ని సున్నితంగా విమర్శిస్తూ జీవితం మీద వారికి ఒక అవగాహన కలిగిస్తూ,కనువిప్పు కలిగించే చక్కని సందేశాత్మక చిత్రం.ఈ చిత్ర కథతో పాటు ఆ కథకు చక్కని సంభాషణలను కూడా దర్శకుడు సంపత్ నంది వ్రాశారు.ఈ చిత్రం ముందు స్లోగా మొదలై,నేటి తరపు ఆలోచనలతో,వారికి ప్రేమ,పెళ్ళి,జీవితాల మీద ఉన్న అభిప్రాయాలతో మనకు తెలియకుండానే కథలోకి లాక్కెళుతుంది.ఒక చక్కని కథను మరింత చక్కని స్క్రీన్ ప్లే తో అత్యంత చక్కగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు సంపత్ నందికే దక్కుతుంది.కానీ ఇలాంటి కథను తెరకెక్కించటానికి మంచి అభిరుచి ఉన్న నిర్మాత కావాలి.అలాంటి అభిరుచి ఉన్నచక్కని నిర్మాత కె.కె.రాధామోహన్ ని ముందుగా అభినందించాలి........

మొతానికి మాంచి చూడాలి అనే వాళ్ళకి....నేటి సమాజం సెక్స్ మీద ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి అంటే వెళ్లి చుదలిసిన సినిమా.....

No comments: