Friday, November 19, 2010

తెలుగు సినిమా "హీరో" మారడ....? టైటిల్స్‌కోసం, పాట పల్లవిలకోసం, కథల కాపీలకోసం పోరాటాలు చేయడం ఏంత దౌర్భాగ్యం...


‘తెలుగు పరిశ్రమలో దమ్మున్న హీరోలు లేరా? అనే విధంగా ప్రశ్నించిన తమ్మారెడ్డి భరద్వాజ వివాదాలను ఎదుర్కొన్నా రీమేక్, సీక్వెల్, రీమిక్స్‌లకు హీరోలు ‘సై’ అన్నప్పుడు తెలుగు సినిమా తీరే ఇంత? అనిపించక మానదు.తెలుగులో ప్రయోగాలకు చోటులేదు కొత్తదనానికి ఆస్కారం లేదు అనడానికి వీలులేకపోవడం వల్లనే అడపాదడపా భారీ హిట్స్ వస్తున్నాయి.

తమిళంలో సర్కస్ జీవితాలను ఆవిష్కరించే విధంగా ‘సూర్యా’ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్నామని హిందీలో ‘దోబీ ఘాట్’ని అమీర్‌ఖాన్ నిర్మిస్తున్నాడని వార్తలు వస్తుంటే తెలుగులో యలమంచిలి సాయిబాబా నిర్మాతగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో ‘లవకుశ’, రామానాయుడు నిర్మాతగా జూ.ఎన్టీఆర్‌తో ‘రాముడు-్భముడు’ సెట్స్‌పైకి వెళ్లనున్నాయన్న వార్తలు వినపడుతున్నాయి. ఇది తెలుగు పరిశ్రమ తీరు. ఇలాంటి పరిస్థితుల్లో అనువాద చిత్రాలు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయంటే కొల్లగొట్టవా మరి? చూసిన కథలే మళ్లీ చూడండని నిర్మాత దర్శక హీరోలు సై అంటే వాటిని ఎంతవరకు ఆదరించాలి....

అనువాద చిత్రాలు తెలుగు పరిశ్రమను అణగదొక్కేస్తున్నా ఎవరిలోనూ పెద్దగా చలనం లేకపోవడం బాధాకరం. శివాజీ చిత్రాన్ని 15 కోట్లకు, రోబో చిత్రాన్ని 27 కోట్లకు మనం కొనుక్కుని మురిసిపోవడం దౌర్భాగ్యం. ఇలాంటి చిత్రాలు మన అగ్రహీరోలు చేస్తే ఇతర భాషలవారు అనువాద చిత్రాలుగా వారి రాష్ట్రంలో విడుదల చేసుకోకుండా డబ్బింగ్ హక్కులను కాకుండా రీమేక్ హక్కులను కొనుక్కుని వారి హీరోలతో తీసి అక్కడి ప్రజలను మెప్పిస్తారు. ఈ మధ్యకాలంలో మన హిట్ సినిమాలు ఎన్నో హిందీ, తమిళ భాషల హీరోలతో రీమేక్‌లై ఘనవిజయం సాధించాయి. అంతెందుకు ఆఖరికి ఏ ఇమేజ్ లేని హీరోల సినిమా హ్యాపీడేస్‌ని కూడా తమిళంలో రీమేక్ చేసారు. దానినిబట్టే అర్ధమవుతుంది హిందీ, తమిళవారు ఇతర భాషా హీరోలను డబ్బింగ్ పేరుతో ఎంట్రీకాకుండా ఎలా చూసుకుంటున్నారో!


మరి మనం ఇతర భాషా నటుల సినిమాల డబ్బింగ్‌కి ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు సినిమాకు ఇవ్వం. పైగా వారిని భుజాన మోస్తాం. కాబట్టే ప్రేక్షకులు నేడు వారి సినిమాలకు నీరాజనం పడుతూ ఫ్యాన్స్‌గా కూడా మారిపోతున్నారు. దాదాపు తమిళ నటుల చిత్రాలన్నీ డబ్ చేయబడి ఘనవిజయాలు సాధించాయి. హిందీలో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ చిత్రాలకు నేడు తెలుగు మార్కెట్ బోల్డంత ఉంది....

దాదాపు 50 కోట్లతో తీసిన కొమరంపులి దానికంటే తక్కువ బడ్జెట్‌లో తీసిన మగధీర ప్రేక్షకులను మెప్పించడంలోనూ కలెక్షన్లను కొల్లగొట్టడంలోనూ తేడా చూపడానికి ప్రధాన కారణం మూసకధ, కంచికిపోయిన కథ కొమరంపులిలో కనిపించడమే. చిత్రపరిశ్రమ ఆలోచించాలి. మిగతా పరిశ్రమ విజయాలవైపు కూడా చూడాలి. అప్పుడే ఎన్నో మంచి కథలు పుట్టుకొస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు సాగేదెన్నడో? మిగతా భాషా చిత్రాల స్థాయ అందుకునేదెన్నడో? తెలుగు సినిమా కథ అంతర్జాతీయ స్థాయలో రెపరెపలాడేదెన్నడో? ఆ రోజులు రావాలి...మంచి కథలు కావాలి!!

1 comment:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

చెవిటి వాడి ముందు శంఖం ఊడటం గురించి విన్నావా బ్రదర్?