Monday, November 29, 2010

రామ్ చరణ్ ‘ఆరెంజ్’ ఫట్ అవ్వడానికి రాజమౌళికి సంబంధం....



హిట్ సినిమాల దర్వకుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తే దవ మారుతుందని, సినిమా సూపర్ హిట్ అవుతుందని..అయితే ఆ తర్వాత ఆ హీరోలను ప్లాపుల రూపంలో దురదష్టం వెంటాడం ఖాయమని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం. ఆ ప్రచారానికి తగిన విధంగానే రాజమౌళి తో నటించిన యువహీరోలు జూ ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, నితిన్, మొదలైన వారితో పాటు తాజాగా రామ్ చరణ్ కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాడు.

మగధీర లాంటి భారీ హిట్ తర్వాత ‘ఆరెంజ్’ సినిమాతో వచ్చిన రామ్ చరణ్ తాజాగా ఆ అనుభవం ఎదుర్కొటున్నాడు. తొలిరోజే ఆరెంజ్ సినిమా పై డిబైడ్ టాక్ వచ్చింది. స్టోరీ అస్సలు బాగోలేదని, మాస్ పీపుల్ రీచ్ కావడం లేదని, సినిమా అంతగా ఆడటం కష్టమే అనేది సినీ పండితుల వాదన. అయితే ఆరెంజ్ సినిమా ఫట్ అవ్వడానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ అంతకు ముందు నటించడమే అనే వాదన తెరపైకి వచ్చింది. కానీ ఇలా వాదించడం ఎంత వరకు సబబు అని రాజమౌళి అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ తో పాటు, గత హీరోలు మంచి కథలను, ఆ కథను ప్రేక్షకుల నాడికి అనుగుణంగా తెరకెక్కించే దర్శకులను ఎంచుకోవడంలో విఫలమై..దానిన రాజమౌళి పై రుద్దడం అలవాటుగా చేసుకున్నారని మండి పడుతున్నారు. ఈ మధ్య సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం అవుతున్న పవన్ కళ్యాణ్ తో ఆరెంజ్ కథను ఎంపిక చేయించడం చరణ్ చేసి పెద్ద తప్పని..తప్పులన్నీ అటువైపు పెట్టుకొని రాజమౌళి పై నిందలు వేయడం ఎందుకని చురకలంటిస్తున్నారు.

1 comment:

Anonymous said...

Raviteja ememi cinemas plop ayyayi vikramarkudu taruvata