కన్నడ నటి దివ్య స్పందన, రామ్ చరణ్ ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తామిద్దరం మంచి ప్రెండ్స్ మి అని కొట్టిపారేసారు. ఇక రీసెంట్ గా దివ్య స్పందన తన పుట్టినరోజుని జరుపుకుంది. రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకమైన గిప్ట్ పంపి ఆమెకు తాను మంచి స్నేహితుడునని బర్తడే విషెష్ తెలియపరిచాడు. నిజానికి దివ్య స్పందన తెలుగులో అభిమన్యు, అమృత వర్షం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాలలో తప్ప కనపడలేదు. అలాంటి ఆమెతో రామ్ చరణ్ కి ఎలా పరిచయం అయిందని ఆసక్తి కలగటం సహజమే. నిజానికి వీరి స్నేహం ఫిల్మ్ ఏక్టింగ్ కోర్స్ సమయంలో జరిగిందిట. అక్కడ వీరిద్దరూ క్లాస్ మేట్స్. ఆ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా మెలిగేవారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో డైలీ ఛాటింగ్ చేసుకునేవారిని, ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకునే వారని, సౌత్ స్కోప్ అవార్డుల పంక్షన్ లో మళ్ళీ కలిసారని అతని సన్నిహితులు చెప్తున్నారు. ఆమె ఆరెంజ్ విడుదల అప్పుడు చరణ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి బెస్ట్ విషెష్ చెప్పిందని తెలుస్తోంది...
No comments:
Post a Comment