Wednesday, November 24, 2010

జగన్‌ ఔట్‌.. ! చిరు ఇన్‌ !...వోట్ వేసిన వాడికి బొమ్మ చూపిస్తున్న రాజకీయనాయకులు


రోశయ్య.... చిరంజీవి.... భిన్న పార్టీ నేతలు... కానీ ఒకే రోజు ఢిల్లీలో ప్రత్యక్షం.... ఎవరిదారి వారిదేనన్నట్లు ఎవరికి వారు వెల్లడి. కానీ ఇద్దరూ రహస్యంగా కాసేపు అదృశ్యం... ఎక్కడికెళ్లారు? సోనియా నివాసంలో అహ్మద్‌పటేల్‌ వద్ద ప్రత్యక్షమయ్యారని వినికిడి...

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రోశయ్యపై తిరుగుబావుటా ఎగురవేస్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కథ కంచికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనపై అధిష్ఠానం నిర్దిష్టమైన హామీ ఇచ్చింది. జగన్‌పై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి చేయి జారిపోతుందన్న రోశయ్య ఆందోళనలో అధిష్ఠానం కూడా పాలుపంచుకుంది. అయితే.. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
 
జగన్‌ తిరుగుబాటు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో పరి ణామాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. తనను నిరాదరణకు గురిచేస్తున్న అధిష్ఠానంపై ఆగ్రహంతో పార్టీని చీల్చే ఎత్తుగడలో జగన్‌ తలమునకలయి ఉన్నారు. అదే సమయంలో.. పార్టీకి జగన్‌ వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు నాయకత్వం పీఆర్పీ అధ్యక్షుడు చిరం జీవిని ప్రత్యామ్నాయంగా రంగంలోకి దింపింది. స్వయం గా.. ముఖ్యమంత్రి రోశయ్య మెగాస్టార్‌ను మంగళవారం సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ను కలిపించి, భేటీ అయ్యారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మె ల్యేల మద్దతుతో పాటు, మజ్లిస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నందున జగన్‌ గురించి భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

No comments: