క్రితం శుక్రవారం కళ్యాణ్ రామ్ కత్తి, వరుణ్ సందేశ్ ఏమైంది ఈ వేళ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. చెల్లెలు సెంటిమెంట్ ను నమ్ముకుని కళ్యాణ్ కత్తి, అమీర్ పేట సాప్ట్ వేర్ జనాల కామిడిని నమ్ముకుని ఏమైంది ఈ వేల వచ్చాయి. మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక చతికిలపడ్డాయి.ఈ రెండు చిత్రాలు ప్రమోషన్ లో బిజీగా ఉండి జనాలని ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అలాగే అంతకుముందు వారం విడుదలైన కలెక్టర్ గారి భార్య, షాపింగ్ మాల్ పూర్తిగా డల్ గా ఉన్నాయి. ఉన్నంతలో డబ్బింగ్ చిత్రమైనా షాపింగ్ మాల్ బెటర్ అంటున్నారు. కలెక్టర్ గారి భార్య చిత్రం మరీ పాత వాసనలు వెదజల్లుతూండటం ఆ చిత్రానికి మైనస్ గా మారింది.
No comments:
Post a Comment