తమిళ నటుడు ఎంఆర్ రాధా కుమార్తె అయిన రాధిక తొలుత అడుగుపెట్టింది వెండితెరపైనే కానీ, ఇప్పుడు రాణిస్తున్నది మాత్రం బుల్లి తెరపైనే. ‘నల్ల పిల్ల’ అనే ముద్దు పేరున్న రాధిక వెండితెరపై అటు తెలుగు, తమిళ భాషల్లో అగ్రశ్రేణి హీరోలందరి సరసన నటించడమే కాక కొన్ని కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. మలయాళ నటుడు ప్రతాప్ పోతన్‌తో వివాహం తర్వాత కొంతకాలం వెండితెరకు దూరమైంది. అయితే ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు. ప్రతాప్ పోతన్‌కు విడాకులిచ్చిన రాధిక బ్రిటీష్ జాతీయుడు రిచర్డ్ హార్డీని వివాహం చేసుకున్నా అతనికి కూడా విడాకులిచ్చి తమిళ నటుడు శరత్ కుమార్‌ను వివాహం చేసుకుంది. దీంతో ఆమె మళ్లీ నటన వైపు దృష్టి పెట్టింది. కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ తర్వాతి కాలంలో ఆమె ప్రధానంగా బుల్లి తెరపైనే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాడాన్ మీడియా వర్క్స్ పేరుతో సంస్థను స్థాపించి బుల్లితెర సీరియల్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది. మొదట్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమిళంలో సన్‌టీవీ కోసం తీసిన ‘చిత్తి’ సీరియల్‌తో ఆ సంస్థ దశ తిరిగింది. ‘పిన్ని’ పేరుతో తెలుగులోకి డబ్ అయిన 488 ఎపిసోడ్ల ఈ మెగా సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమై లక్షలాది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొనింది. ఈ సీరియల్ విజయ స్ఫూర్తితో రాధిక ‘అన్నామలై’ అనే మరో మెగా సీరియల్ తీసింది. ఈ రెండు సీరియల్స్‌లోను రాధిక సరసన తమిళ సినీ నటుడు శివకుమార్ ప్రధాన పాత్రలో కనిపించారు. తమిళంలో చెల్వి, అరసి, రుద్రవీణై, శివమాయం, చిన్న పాప, పెరియ పాప, తిరువిలైయాడాల్ లాంటి అనేక సీరియల్స్ తీసిన రాధిక తెలుగులో గాయత్రి, రాజుగారి కూతుళ్లు, తల్లి ప్రేమ, కథకాని కథ, నినే్న పెళ్లాడుతా, అమ్మాయి కాపురం లాంటి పాపులర్ సీరియళ్లు తీసారు. ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమైన ‘అమ్మాయి కాపురం’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తమిళం, తెలుగు రంగాలకే పరిమితం కాని రాడాన్ జీ టీవీ కోసం ‘చోటీ మా’ పేరుతో పిన్ని సీరియల్‌ను పునర్నిర్మించింది. మలయాళంలో కూడా పలు సీరియల్స్ తీసిన ఆ సంస్థ ఈటీవీ గుజరాతీ చానల్ కోసం తొలిసారిగా ‘కంకు పగ్లా’ అనే సీరియల్‌ను నిర్మించింది. అక్కడితో ఆగకుండా ఆ సంస్థ ఇప్పుడు శ్రీలంక చానల్ ‘సిరసా’ కోసం ‘వసూధ ’పేరుతో సింహళ భాషలో ఓ మెగా సీరియల్‌ను తీస్తోంది.
కేవలం టీవీ సీరియల్స్‌కే పరిమితం కాకుండా రాడాన్ తన కార్యకలాపాలను ఇతర రంగాలకు కూడా విస్తరించింది. తమిళ, మలయాళ భాషల్లో కోటీశ్వరన్ పేరుతో ఒక గేమ్ షోను నిర్మించింది. అమితాబ్ బచ్చన్ కరోడ్ పతి కార్యక్రమంలాగా ఈ గేమ్ షోలో కూడా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అవకాశం కల్పించారు. రాడాన్ సంస్థ తీసిన సీరియల్స్ మొదట ఏ భాషలో ఉన్నా మిగతా దక్షిణాది భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. అంతేకాదు, అక్కడ కూడా విజయవంతం కావడం విశేషం.
కేవలం టీవీ సీరియల్స్‌కే పరిమితం కాకుండా రాడాన్ తన కార్యకలాపాలను ఇతర రంగాలకు కూడా విస్తరించింది. తమిళ, మలయాళ భాషల్లో కోటీశ్వరన్ పేరుతో ఒక గేమ్ షోను నిర్మించింది. అమితాబ్ బచ్చన్ కరోడ్ పతి కార్యక్రమంలాగా ఈ గేమ్ షోలో కూడా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అవకాశం కల్పించారు. రాడాన్ సంస్థ తీసిన సీరియల్స్ మొదట ఏ భాషలో ఉన్నా మిగతా దక్షిణాది భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. అంతేకాదు, అక్కడ కూడా విజయవంతం కావడం విశేషం.
No comments:
Post a Comment