ఒక సినిమాకు తమిళ దర్శకుడు పనిచేస్తున్నాడంటే.. సినిమాలో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో సగా నికి పైగా తమిళియన్సే ఉంటారు. అంటే ఆ మేరకు మన తెలుగు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ప్రకాష్‌రాజ్, నాజర్ వంటి ప్రతిభావంతుల్ని పక్కన పెట్టేసినా.. ప్రభు (శివాజీగణేశన్ కొడుకు), సత్యరాజ్ వంటివారు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అవుతున్నారంటే అందుకు కారణం మన తెలుగు తెరపై పెరిగిపోతున్న తమిళ పెత్తనమే.
‘డార్లింగ్’లో ప్రభాస్ ఫాదర్‌గా ప్రభు చేసిన క్యారెక్టర్ మన తెలుగులో ఎవరూ చేయలేరా? ఎందుకు అతడ్ని తమిళనాడు నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కరుణా కరన్ తమిళియన్ కాబట్టి.. అతను చిన్నప్పట్నుంచి తమిళ సినిమాలు చూసి మాత్రమే పెరిగాడు కాబట్టి.. ఆతను ఆ క్యారెక్టర్‌ను కన్సివ్ చేసుకున్నప్పుడు అతని మదిలో ఆటోమేటిక్‌గా ప్రభు మెదిలాడు. అలాగే, ఈనెల 26న విడుదల కానున్న ‘ఆరెంజ్’లోనూ ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కారణం ఈ చిత్ర దర్శకుడు భాస్కర్ కూడా తమిళ సోదరుడే. కాబట్టి.. కరుణాకరన్‌కు వర్తించిన విశ్లేషణే ఇతనికి కూడా వర్తిస్తుంది.
ఇక ‘డార్లింగ్’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన జి.వి.ప్రకాష్‌కుమార్, ‘ఆరెంజ్’కు సంగీత సారధ్యం చేసిన హ్యారిస్ జైరాజ్.. ఇద్దరూ తమిళులే కావడం కూడా ఇక్కడ గమనార్హం. ఇవి ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంశాలు. పైకి కనిపించనివి ఇంకెన్ని ఉంటాయి?
ఈ పరిస్థితుల్లో.. తెలుగు సినిమాను మద్రాసు నుంచి తరలించి హైద్రాబాద్‌లో స్ధిరపడేలా చేసామని చంకలు గుద్దుకోవడంలో కానీ, గొప్పగా చెప్పుకుంటూ సంబరపడు తుండడంలో కానీ సహేతుకత ఏమైనా ఉందంటారా? మన తెలుగు సినిమా పెద్దలు కానీ, ప్రభుత్వం కానీ ఈ విషయం గురించి ఎందుకు దృష్టి పెట్టరు?
సినిమా అనే వినోద సాధనాన్ని సామాన్యుడికి అందుబా టులో లేకుండా తమ ఇష్టానుసారం టిక్కెట్ రేట్లు పెం చేస్తూ.. ‘రోజురోజుకీ పైరసీ ప్రబలిపోతోంది. పైరసీ వల్ల సినిమా రంగం నాశనమైపోతోందంటూ’ గగ్గోలు పెడుతుం డడంలో ఔచిత్యం ఏమైనా ఉందంటారా?
టిక్కెట్ తీసుకున్నది మొదలు సినిమా చూసి బయటకు వచ్చేంతవరకూ కనీసం మూడు గంటల సమయాన్ని గడిపే ధియేటర్లలో ఉచిత మంచినీటి సరఫరా వంటి కనీస సదు పాయం కూడా లేకుండా చేస్తూ.. ధియేటర్లవాళ్లు నిర్ణయిం చిన ధరలకు మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి కల్పిస్తున్నా.. ఎవరూ ఎందుకు ప్రశ్నించరు?
పైరసీ అనే మహమ్మారి మన తెలుగు సినిమా మనుగ డను ప్రశ్నార్ధకం చేస్తున్నదంటూ ఆందోళన చేసి ప్రభు త్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చే పెద్ద మనుషులంతా.. తెలుగు సినిమా రంగంలో తెలుగువారు తమ ఉనికిని పూర్తిగా కోల్పోతున్నా.. తెలుగువారికి అసలు మనుగడ న్నదే లేకుండా పోతున్నా ఎందుకు పట్టించుకోరు?

No comments:
Post a Comment