సినిమా మంచి చెడ్డలకు కలెక్షనే్ల కొలమానమని, వర్ధమాన హీరోలు బల్లకొట్టి చెబుతున్న కాలంలో, సినిమాకు ప్రణాళికా బద్ధంగా హైప్ తీసుకువచ్చి, వందలాది థియేటర్లలో విడుదల చేసి, జనానికి ‘అసలు’ విషయం తెలిసేలోగానే కావాల్సినన్ని కాసులు వసూలు చేసేసుకునే నిర్మాతులున్న ఈ రోజుల్లో, తమ ప్రతిభాపాటవాలకన్నా, కథాబలం కన్నా, హీరోయిన్ అంగాంగ ప్రదర్శనపైనే నమ్మకాన్ని పెంచుకుంటున్న దర్శకులున్న చోట, క్లీన్‌గా, హడావుడి లేకుండా, కామెడీ ప్రధానంగా చిన్న సినిమా తీయడం అంటే కాస్త ధైర్యం చేయాల్సిన విషయం. అయితే పైన చెప్పుకున్నవన్నీ పట్టని సంస్థ కాబట్టి, థియేటర్లు తెచ్చుకోగలగిన సామర్ధ్యం వున్న వారు కాబట్టి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ‘బెట్టింగ్ బంగార్రాజు’ చిత్రాన్ని తీయగలిగింది. ఒకప్పుడు రిలీఫ్ కావాలంటే రాజేంద్రప్రసాద్ సినిమాలు చూడాలి..అనుకునే వారు ప్రేక్షకులు. మళ్లీ అలా అనిపించిన సినిమా ఈ ‘బెట్టింగ్ బంగార్రాజు’. అద్భుతమైన సినిమా అని కాదు..గొప్ప కథ అనీ కాదు.. కానీ, ప్రేక్షకులు హాయిగా నవ్వుకోగలిగిన సినిమా. ముఖ్యంగా వెకిలి..బూతు..చెత్త హాస్యం లేదు. ఎక్కడా బోర్ ఫీలవ్వాల్సిన పనిలేదు. గ్రాఫిక్ మాయాజాలంతో హీరో వెళ్లి ఢీకొంటే కొండ పగిలినట్లు చూపిస్తున్న సినిమాలు వస్తున్నాయి కాబట్టి, కాస్త సబ్జెక్ట్ అటు, ఇటుగా వున్నా పట్టించుకోనక్కరలేదు...
స్క్రిప్ట్ పకడ్బందీగా తయారుచేసుకున్నాడు దర్శకుడు సత్తిబాబు. వీలయినంతవరకు తన పాయింట్‌ను కన్విన్సింగ్‌గా తెలియచెప్పడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఈ సినిమా వినోద సన్నివేశాల సమాహారం తప్ప మరేదీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకున్నాడు. ఆ విషయంలో చాలా బ్యాలెన్సింగ్‌గా వ్యవహరించాడు. ఏ క్యారెక్టర్‌ను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేసాడు. ఫస్ట్ హాఫ్‌లో కృష్ణ్భగవాన్ బృందాన్ని వాడుకుంటే, సెకండాఫ్‌లో రఘుబాబు పూర్తిగా వినియోగించుకున్నాడు. రఘుబాబు కామెడీని సెకండాఫ్ మొత్తం వాడుకున్నా, బోర్ అనిపించకుండా, కాంబినేషన్లు మార్చి, జాగ్రత్త పడ్డాడు. రచయిత గంధం నాగరాజు కామెడీని బాగా డీల్ చేసాడు. శేఖర్‌చంద్ర సంగీతంలో..నీలిమేఘం పాట మెలోడియస్గా బాగుంది. అనంత్‌శ్రీరామ్ సాహిత్యం కూడా బాగుంది. మా ఇంటిమహలక్ష్మి.. ఫరవాలేదు.. మిగిలినవి సోసో... సినిమా రిచ్‌నెస్ గురించి పెద్దగా చెప్పుకోనక్కర లేదు కానీ, డ్రెస్‌ల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడితే బాగుండేది. నటీనటులందరూ ఎవరి పాత్రమేరకు వారు బాగానే చేసారు. కొత్త అమ్మాయి నిధి హావభావాలు బానే వున్నాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, సరదాగా కాలక్షేపం చేసి రావడానికి పూర్తిగా పనికొచ్చే సినిమా
1 comment:
dude.. ur blog has so many popups and ads that it almost killed my system.
Post a Comment