Monday, November 22, 2010

నిన్న టీ.వీ లో ‘ఝుమ్మందినాదం’ చుసా తూ! ఇది ఒక సినిమా నా...చూడానికి సిగ్గులేకుండా ఒక ఆడ నిర్మాత....



‘ఝుమ్మందినాదం’ సినిమాకు రెండు దరిద్రామయిన ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా ఎస్.ఎస్.రాజ్‌వౌళి, వి.వి.వినాయక్ లాంటి యాక్షన్ సినిమాల దర్శకులు సన్నివేశాలకు మరింత ఎమోషన్ తీసుకురావడానికి ఒకటికి మించిన కెమెరాలు వాడతారు. కానీ కె.రాఘవేంద్రరావు లాంటి సాఫ్ట్ డైరక్టర్ ఈ సినిమాకు కొంచెం ఎక్కువ కెమెరాలే వాడాల్సి వచ్చింది. కొత్త నటి తాప్సీ తొడల నిగారింపు, ఆమె ధరించిన చిన్ని దుస్తుల్లోంచి లోదుస్తుల అంచులు కనిపించడానికి ఓ కెమెరా, నడుం మెరుపులు, బొడ్డు లోతులు తరచు చూపించి, ప్రేక్షకులను తరింపచేయడానికి మరో కెమెరా, ఇక ఎదలోతులను తరచి తరచి చూపించేందుకు వీలుగా ఇంకో కెమెరా..ఇలా వాడాల్సి వచ్చిందేమో. ఇక రెండో విశేషం సినిమా కథాబలంపైనో, దర్శకుడి సత్తాపైనో కాకుండా, అమ్మాయి అందంచందాలపైనా, పాటల్లో ‘నోటిలో బిళ్ల..తేనె ఊటలు ఊరడం, చప్పరింతలు, పర్వతశిఖరాలు’ లాంటి పదాలపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకుని తీసిన ఈ సినిమాకు నిర్మాత ఓ మహిళ కావడం....

తెలుగునాట ఓ సామెత వుంది. ‘తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే..’ అని, అలాగే మహిళ అయితేనే మగాడు అయితేనే, నిర్మాత అవతారం ఎత్తాక కాసుల కోసం సినిమాలో సభ్యం..అసభ్యం అన్న సంగతి మరిచిపోవాలని.. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

అనుభవజ్ఞుడైన దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయన సాంకేతిక బృందం కేవలం సినిమా హిట్‌కావాలి..అది కొత్తదనమైతేనేం..అలవాటైన పాతదనమైతేనేం..సన్నివేశాలు కావచ్చు..సంగీతం కావచ్చు..చిత్రీకరణ కావచ్చు..అన్నీ ఎన్నో సార్లు చూసినట్లే అనిపిస్తాయి. నిజానికి సినిమా పాయింట్ కొంతవరకు కొత్తగానే వుంది. కామెడీ బాగానే పండిందని చెప్పాలి. మోహన్‌బాబు క్యారక్టర్ కొన్ని సార్లు మరీ తేలిపోయింది. మనోజ్ నటన చూస్తుంటే కార్టూన్ ఫిల్మ్‌ల్లో క్యారెక్టర్ల నటన గుర్తుకువస్తుంది. అయితే ఈ కామెడీ క్యారెక్టర్‌కు అది సరిపోయింది. ప్రయాణం చిత్రంలో కూడా ఈ తరహా నటన కొంతవరకు కనిపిస్తుంది. కానీ ఇదే ఫాలో అయిపోతే ఓ ముద్ర పడిపోయే ప్రమాదం వుంది

కేవలం నాలుగు ఆ...తరహాపాటలు చిత్రీకరించి, అదే తెలుగు సంప్రదాయ, జానపద సంగీతం అనుకోవడం ఏమిటో, దాన్ని చూసి పలువురు పెద్దలు అహో.. అద్భుతం అనడం ఏమిటో? అలాగే పెళ్లి సన్నివేశంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులను ఫోకస్ చేయకుండా, మనోజ్, తాప్సీ వెక్కివెక్కి ఏడవడం ఏమిటో? గతంలో వచ్చిన పెళ్లిలో జోళ్లు దాచే సీక్వెన్స్, ఆ సమయంలోనే ప్రేమ అంకురించడం..ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. ఈ సినిమాలో సన్నివేశాలు చాలా వరకు గతంలో రాఘవేంద్రరావు పెళ్లిసందడి, బొంబాయిప్రియుడు, ఇంకా చాలా సినిమాల్లో విన్నవే..కన్నవే. ఇక కీరవాణి సంగీతంలో పాటలు కూడా చాలా వరకు గతంలో విన్నట్లున్న ట్యూన్లు, శబ్ధాలే.. ......పాట కాస్త కొత్తగా వుంది. సినిమా ప్రారంభంలో సంగీత పోటీ పాట కన్నా చివరిలో పాట బాగుంది. నిజానికి ఈ సినిమాలో తాప్సీ అందాల ప్రదర్శనపై పెట్టిన దృష్టి కొంత వరకు తగ్గిస్తే పిల్లలతో కలిసి, పెద్దలు చూడగలిగేలా వుండేది.

ఇప్పుడు చెప్పండి....‘ఝుమ్మందినాదం’ అసలు ఎలా ఉందో...మీరు సినిమా చూస్తే ఒక కామెంట్ రాయండి నా అభిప్రాయం మీద....

2 comments:

పండు said...

మీ బ్లాగులో ఏమేం widgets పెట్టారో గాని, officeలో మీ బ్లాగు తెరవగానే, మా network వాడికి పండగే.... వందల alerts వెల్తున్నాయంట. మొన్నోసారి నువ్వే బాబు కంపెనీలో టాప్ malicious alertsలో అని బిరుదుకూడా యిచ్చాడు.
ఏదైతే అదైందని, ఈరోజు యింట్లో ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుని కామెంటు పెడుతున్నా.. అప్పటికీ, రెండుమూడు windows, ఒక pdf, ఒక మీడియా file.. యిన్ని ఓపెన్ అవ్వడానికి చూశాయి.
కాబట్టి నాఘోషేంటంటే, యిలాంటివి వుంటే ఎవరైనా తెలియకుండా open చేస్తే అంతే సంగతులు, చిత్తగించవలెను.
ఈ malicious widgets తీసేయడానికి వీలుంటుందేమో చూడండి.

Venkat said...

chetta cinema