Wednesday, December 1, 2010

శ్రీనువైట్ల 'రెడీ' చిత్రం తమిళ రీమేక్ హిట్టా?ప్లాపా?....


రామ్, జెనీలియా కాంబినేషన్ లో శ్రీనువైట్ల రూపొందించిన రెడీ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ చిత్రాన్ని తమిళంలో ధనుష్, జెనీలియా కాంబినేషన్ లో ఉత్తమ పురషన్ టైటిల్ తో రీమేక్ చేసారు. మిత్రన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై మంచి ఓపినింగ్స్ సాందించుకుంది. అంతేగాక ఈ చిత్రం మంచి రివ్యూలను సంపాదించుకుని జనాల్ని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా బ్రహ్మానందం తెలుగులో చేసిన మెక్ డెవిల్ మూర్తి పాత్రను తమిళంలో వివేక్ చేసి అదరకొట్టాడని టాక్ వచ్చింది. ఆ పాత్ర పేరు ఎమోషనల్ ఏకాంబరం..అదే సూపర్ గా వర్కవుట్ అయిందనె చెప్తున్నారు. ధనుష్ కెరీర్ లో ఇదో సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ అవుతోంది.

No comments: