Wednesday, December 1, 2010

ట్విట్టర్ లో పిచ్చివేశాలేస్తున్న రామ్ చరణ్.....‘ఆరెంజ్’ప్లాప్ తో మైండ్ దొబ్బినట్టుంది...


ఆరెంజ్’ సినిమా నచ్చిందని చెప్పేవాళ్ల కంటే అది నచ్చక పిచ్చెక్కిపోయిందని అంటున్నవాళ్లే ఎక్కువున్నారు. ఆరెంజ్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికని ట్విట్టర్ లో దిగిన రామ్ చరణ్ రెండ్రోజులు బానే ఉన్నాడు. కానీ తర్వాత ఏమైందో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తన ముఖాన్ని క్లోజప్ లో ఫోటో తీసుకుని ‘ఆ చూపేంటమ్మా’ అని క్యాప్షన్లు పెట్టి తనని తనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. గుడ్ నైట్ అని ఫాన్స్ కి చెప్పి తన కళ్లని, ఎర్ర బూట్లనీ ఫోటో తీసి అప్ లోడ్ చేశాడు. అంటే ఇతగాడి ఉద్దేశమేంటి?తను వేసుకున్న బూట్లు చూసిస్తున్నాడా?లే పడుకునే ముందు కాళ్లకి దణ్ణం పెట్టుకోమంటున్నాడా? అని జనం కామెంట్ చేస్తున్నారు. వెండితెరపై కనిపించినప్పుడు హీరోల్లా అనిపించేవాళ్లు ఒక్కోసారి బయట తిక్కలమేళంలా అనిపిస్తారు. చరణ్ కూడా ఆ బాపతేనా ఏంటి? ఇంకొన్నాళ్లాగితే ఇతగాడి యవ్వారమేంటో పూర్తిగా తెలిసిపోతుంది.

మీరు ఎం అంటారు.....

No comments: