కమిడియెన్ బ్రహ్మానందం తెరపై ఎంత నవ్విస్తూంటారో, తెర వెనక జనాల్ని అంతలా ఏడిపిస్తూంటరనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఆయన ఉంటే సినిమాకి చాలా ప్లస్ అవుతుందనే ఆలోచనతో లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ భరిస్తూంటారు. అందులోనూ పెద్ద సంస్ధలు, నిర్మాతలు, దర్శకులు దగ్గర వంగి ఉండే బ్రహ్మీ అవతలవాడు కొత్త అని తెలిస్తే ఆడుకోవటం ప్రారంభిస్తూంటాడు. ఆయన విపరీత చేష్టలు గురించి పరిశ్రమలో కథలు, కథలుగా చెప్పుకుంటారు..కానీ ఎదిరించి ఏమీ అనలేరు. అయతే తాజాగా బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ని హీరోగా పెట్టి వారెవా అనే సినిమా చేస్తున్న నిర్మాత మహి ఆయనకు ట్విస్ట్ ఇచ్చాడని సమాచారం.తన కొడుకు రీఎంట్రీ సినిమా అని కూడా వదలకుండా తన రెమ్యునేష్ సెటిల్ చేయాలని, కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని కండీషన్స్ పెట్టి డబ్బింగ్ చెప్పకుండా ఆపుచేసారు. రోజులు గడిచి ఫైనాన్స్ లు, వడ్డీలు పెరగటంతో బ్రహ్మానందంను ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోకపోవటంతో వేరే వారి చేత బ్రహ్మానందంకు డబ్బింగ్ చెప్పించారు. చాలా మంది బ్రహ్మానందం పాత్రకు వేరే వారు చెపితే జనం గుర్తు పట్టేస్తారని హెచ్చరించినా ముందు సినిమా బయిటపడటం ముఖ్యమనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుతున్నారుట. ఈ విషయం తెలిసిన చాలా మంది బ్రహ్మంకు భలే బుద్ది చెప్పాడు అని వెనక నవ్వుకుంటున్నారు.
No comments:
Post a Comment