Tuesday, December 7, 2010

పాపం ఆ డైరక్టర్ ని పబ్ లో కి రానివ్వలేదు....


కలర్స్ స్వాతి నటించిన అనంతపురం 1980(సుబ్రమణ్యపురం) గుర్తుందా..ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు శశికుమార్ ని చెన్నై లోని ఓ పబ్ వారు రానివ్వలేదు.కారణం..ఆయన గర్ల్ ప్రెండ్ తో రాలేదని చెప్పారు. శశికుమార్. తన తాజా చిత్రం ఈశ కోసం రియలిస్టిక్ గా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించరాని ఓ పబ్ ని ఎంచుకుని తన అసెస్టెంట్స్ తో కలిసి ఆ యజమానిని కలిసేందుకు వెళ్ళారు. అయితే అస్సలు వారికి లోపలకే పర్మిషన్ దొరకలేదు. ఖచ్చితంగా గర్ల్ ప్రెండ్ లేకపోతే లోపలకి రానివ్వమని చెప్పేసారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తూ..నేను ఇంతకు ముందు ఎప్పుడూ పబ్ ల్లోకి వెళ్ళలేదు..దాంతో అక్కడ కల్చర్ తెలియదు. గర్ల్ ప్రెండ్స్ లేనిదే లోపలకి రానివ్వరనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను అన్నారు. ఇక తమకు తెలిసిన వారిని పట్టుకుని మరో పబ్ లో ప్రవేశించి పార్టీ ప్రారంభం కోసం ఎదురుచూసారు. అయితే రాత్రి పదకొండు దాటాక కానీ పార్టీ ప్రారంభం కాలేదు. దాంతో పబ్ వారిని ఏంటీ ఆలస్యం అంటే మిడ్ నైట్ లోనే పార్టీలు జరుగుతాయి..అప్పుడే మజా అని చెప్పారుట. ఇక శశికుమార్..రవితేజ చేసిన శంభో శివ శంభో చిత్రం చివరలో కనిపించారు.

No comments: