రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" గురించి నెగిటివ్ మాట్లాడిన వ్యక్తికి ట్విట్టర్ లో గౌవరంగా సమాధానం ఇచ్చి ట్విట్టర్ హీరో అనిపించుకున్నాడు. ఓ వ్యక్తి ట్విట్టర్ లో...హలో సర్..నేను మీకు గ్రేట్ ఫ్యాన్ ని, ఆరెంజ్ సినిమా చూసాను. అది సూపర్ డూపర్ అట్టర్ ప్లాప్ అన్నాడు. దానికి రామ్ చరణ్....రీ ట్వీట్ చేస్తూ..అవును..నువ్వు విన్నది కరెక్టే అన్నాడు. అంతేగాక తన ప్యాన్స్ ని చరణ్..అతనిపై కోపం చూపొద్దని, దానికి బదులుగా ప్రేమని చూపమని ట్వీట్ చేసాడు. హలో గైస్...ఐ యామ్ గోయింగ్ టు రీ ట్వీట్ ఎ మెసేజ్ సమ్ వన్ మెసేజ్ డ్ మి జస్ట్ ప్లీజ్ వెలకమ్ హిమ్..లెట్ ట్రీట్ హిమ్ విత్ లవ్..గైస్ అని సమాధానమిచ్చాడు. ఇక జెనీలియా, రామ్ చరణ్ కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఆరెంజ్ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. నాగబాబు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి షోకే కన్ఫూజ్ గా లవ్ స్టోరిని చెప్పారనే టాక్ తెచ్చుకుంది. ఇక రామ్ చరణ్ కూడా ఈ చిత్రం గురించి చెబుతూ...నేను పర్శనల్ గా నమ్మేది ఒక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని అని అన్నారు.
No comments:
Post a Comment