Friday, December 10, 2010

నాగబాబు కామెంట్ కి వెంకటేష్ దే సరైన కౌంటర్......



నాగబాబు నాలుగు రోజుల క్రిందట..తన తాజా చిత్రం ఆరెంజ్ దర్శకుడు భాస్కర్ ని దృష్టిలో పెట్టుకుని డైరక్టర్స్ కి ఇంగిత జ్ఞానం ఉండాలని, బడ్జెట్ కంట్రోలు లేకుండా ఖర్చుపెట్టించి నిర్మాతని ముంచటం సరైన పనికాదని, కొందరు డైరక్టర్స్ వైరస్ ల్లా తయారై నిర్మాతను నాశనం చేస్తున్నారంటూ బహిరంగంగానే కామెంట్ చేసారు. అయితే ఈ విషయం ప్రస్దావించకుండా వెంకటేష్..రీసెంట్ గా మీడియాతో..కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విషయంలో దర్శకుడు పాత్ర గురించి మాట్లాడుతూ..ప్రాజెక్టు ప్రారంభంలోనే క్లియర్ కమ్యూనేషన్ ఉంటే ఇటువంటి సమస్యలు తలెత్తవు..అంతేగాని అంతా అయిపోయాక బ్లేమ్ గేమ్ ఆడటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అలాగే నా ఉద్దేశ్యంలో టీమ్ అంతా కలిసి చేసే పనే ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ప్రతీ ఒక్కరూ టీమ్ వర్క్ లో బెనిఫిట్ పొందుతారు అన్నారు. నాగబాబు ని డైరక్ట్ గా అనకపోయినా..వెంకటేష్ ఈ విషయమై ఇచ్చిన సమాధానం..ఆయన కామెంట్ కు కరెక్టుగా ఆన్సర్ చేసిందని, ఆరెంజ్ స్క్రిప్టు దశనుంచీ బడ్జెట్ విషయంలో కంట్రోలు ఉండి ఉంటే ఈ రోజున ఇలాంటి సమస్య తలత్తేదికాదని ఫిల్మ్ జనాలు అంటున్నారు. అలాగే వెంకటేష్..తండ్రి, అన్న నిర్మాతలు కావటంతో ఆయనకు ప్రొడక్షన్ పై మంచి అవగాహన ఉందని, అలాంటి వ్యక్తి మాటలు పరిశ్రమలోని వ్యక్తులు తప్పనిసరిగా తలకెక్కించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.