Wednesday, December 1, 2010

అల్లు అర్జున్ పాత్రలో నటిస్తున్న శ్రధ్దా దాస్

అల్లు అర్జున్ తో ఆర్య-2 చిత్రంలో చేసిన శ్రద్దా దాస్ ఆ పాత్రని బాగా వంటబట్టించుకున్నట్లుంది. ఆమె తాజాగా ఒప్పుకున్న కన్నడ చిత్రం హోస ప్రేమ పరున్నా లో ఆ పాత్రను పోలిన క్యారెక్టర్ ని చేస్తోంది. ఈవిషయాన్ని ఆమె మీడియాకు చెపుతూ...ఆ సినిమాలో నేను లోపల దురాలోచనలతో ఉంటూ పైకి మాత్రం మంచిగా ఉండే అమ్మాయిలా కన్పిస్తాను. ఆర్య 2 లో అల్లు అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొంది ఈ పాత్రను రూపొందించారు. ఈ చిత్రంలో నేను,మరో అమ్మాయి (రాధికా గాంధీ) కలిసి ఓ అబ్బాయి (నికిత్) కోసం ట్రై చేస్తూంటాం. అంటే ఆర్య 2 కి రివర్స్ అన్నమాట. నవదీప్ పాత్రను మరో అమ్మాయి చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆర్య 2 కి రీమేక్ లాంటిది.తేడా అల్లా అక్కడ ఇద్దరు అమ్మాయిలు.ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అంతే అంటోంది.ఇక ఈ చిత్రాన్ని శివ కుమార్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే..ఆర్య 2 నిర్మాతలు కాపీరైట్స్ తీసుకోమంటారేమో.

No comments: