Thursday, December 2, 2010

ఈ మధ్య కాలంలో ఆ రెండు చిత్రాలే టాప్ కలెక్షన్ గ్రాసర్స్...



గడచిన రెండు నెలల కాలపరిమితిలో విడుదలైన
తెలుగు చిత్రాలలో కేవలం రోబో, రక్త చరిత్ర చిత్రాలే కలెక్షన్స్ పరంగా బెస్ట్ పేజ్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలూ కూడా డబ్బింగ్ వే కావటం విశేషం. తెలుగులో స్ట్రైయిట్ గా విడుదలయిన మిగతా పెద్ద హీరోల చిత్రాలకు ఎంత పబ్లిసిటీ చేసినా రెండు వారాలు కూడా సరిగ్గా కలెక్షన్స్ నిలబెట్టుకోలేక చతికిలపడ్డాయని ట్రీడ్ రిపోర్టు. రోబో, రక్త చరిత్ర ఈ రెండు చిత్రాలు సుమారు 60 నుండి 70 కోట్లు కలెక్ట్‌ చేస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాలే కనుక లేకుంటే ఈ రెండు నెలలు ఇబ్బంది పడాల్సి వచ్చేదని థియేటర్ల నిర్వాహకులు అంటున్నారు. థియేటర్ల ఫీడింగ్ ‌కు సైతం అవి తోడ్పడుతున్నాయని వారు చెబుతున్నారు. తెలుగు అగ్రహీరోలు నటించిన చిత్రాలు సైతం ఒకటి రెండు వారాలకే డీలాపడగా, డబ్బింగ్‌ సినిమాలు నాలుగు వారాలు దాటినప్పటికీ కలక్షన్స్‌ రాబడుతున్నాయి. ఈ సందర్భంలో డబ్బింగ్‌ చిత్రాలను ఆపువేయాలని, టాక్స్ పెంచి వారి రాకను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వారు ఏం సమాధానం చెబుతారని ఎగ్జిబిటర్స్ ప్రశ్నిస్తున్నాయి. మరో ప్రక్క డబ్బింగ్‌ కేటగిరిలో వస్తున్న హాలీవుడ్ అనువాద చిత్రాలు బి, సి, సెంటర్లలో బాగా వర్కవుట్ అయి ధియోటర్ వారిని నిలబెడుతున్నాయి. ఈ విషయం రోబో, రక్త చరిత్ర ప్రూవ్ చేసాయని చెప్తున్నారు

No comments: