బొమ్మరిల్లు తో ఏ ముహోర్తానా అల్లరి పిల్ల పాత్రలో నటించిందో కానీ ఇక జెనీలియాతో అంతా అలాంటి పాత్రలే చేయించేస్తున్నారు. ఒక్క భాషలో చాలదని అదే క్యారెక్టర్ ని తమిళ, హిందీ భాషల్లో చేసిన జెనీలియా దానిని పోలివున్న పాత్రని చాలా చిత్రాల్లోనే చేసిందీ, చేస్తోందీ కూడా. అయితే జెనీలియాని బొమ్మరిల్లులోనే చాలా మంది ఇష్టపడలేదు. మరీ టూమచ్ గా చేసిందని, ఆమెది నటన అని అనలేమని అప్పట్లోనే కామెంట్ చేశారు. అయినా కానీ ట్రెండు పేరు చెప్పి అంతా జెనీలియాని అలాంటి క్యారెక్టర్లలోనే చూపించారు. దాంతో ప్రేక్షకులకి మొహం మొత్తేసింది.
ఆరెంజ్ సినిమాలో జెనీలియా చేసిన ఓవరాక్షన్ వర్ణనాతీతం. ముఖ్యంగా ఆమె పరిచయ సన్నివేశాల్లో ప్రదర్శించిన నటనకి జనం ఎటు పారిపోవాలో తెలీనంత కంగారుకి గురయ్యారు. కాసేపటికి ఆ క్యారెక్టర్ ని నార్మల్ స్టేట్ కి తీసుకొచ్చారు కానీ ప్రేక్షకులు మాత్రం ఆ కాసేపు పెట్టిన టార్చర్ నే తలచుకుని కంప్లయింట్ చేస్తున్నారు. ఇక జెనీలియా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం మానేయాల్సిన తరుణం వచ్చేసింది. లేదంటే జెనీలియా ుందంటేనే సినిమాకెళ్లేందుకు ప్రేక్షకులు భయపడే ప్రమాదముంటుంది.

1 comment:
meeru sinimala gurinchi baaga rastunnaru.
Post a Comment