Sunday, December 12, 2010

త్రిషను పెళ్ళాడాలంటే ఈ అర్హతలు ఉండాల్సిందే...



హాట్ స్టార్ త్రిష మనస్సు పెళ్ళి మీదకు లాగినట్లుంది. అందుకే తనను వివాహం చేసుకుని తనతో జీవితం పంచుకోవాలనుకునేవాడికి ఉండాల్సిన లక్షణాలు అంటూ ఓ లిస్టు వదిలింది. ఇంతకీ ఆ లిస్టు లో ఏమున్నాయి అంటే...నన్ను పెళ్లాడబోయేవాడు..ఆరు అడుగుల ఎత్తు ఉండాలి. అలాగే శరీరం మంచి ఆకృతితో గ్రీకు వీరుడులా ఉండాలి. ఇక అందమొకటే ఉంటే సరిపోదు..మంచి వ్యక్తత్వం కూడా ఉండాలి. అంతేనా నాతో హ్యాపీగా జీవించటానికి, నా సంపాదనపై ఆధారపడకుండా తన స్వంత ఆదాయ వనరులు కలిగినవాడై ఉండాలి. వీటితో పాటు ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోగలగటం, మంచి సెన్సార్ హ్యూమర్ తప్పనిసరి అంటోంది. ఇవన్ని ఉన్న కుర్రాడుని ఆమె తప్పక పెళ్ళాడతానంటోంది కాబట్టి అవి మీకుంటే ట్రై చేసుకోవచ్చు. అలాగే ఈ లక్షణాలన్నీ ఉన్నా ఆ వ్యక్తి సినిమావాడైతే మాత్రం ఆమె పెళ్ళాడదట. ఈ విషయం నొక్కి మరీ చెప్తోంది. అదీ మ్యాటర్. ప్రస్తుతం త్రిష ...పవన్ కళ్యాణ్ సరసన లవ్ లీ అనే చిత్రంలోనూ. కమల్ హాసన్ సరసన మన్మధబాణం చిత్రంలోనూ ఆమె చేస్తోంది.

No comments: