కృష్ణవంశీగారి నుంచి మేం టైటిల్ను దొంగిలించలేదు. ఆయన్ను స్వయంగా కలిసి, అనుమతి తీసుకున్న తర్వాతే మా నిర్మాత ఈ టైటిల్ను ప్రకటించారు అని హీరో రామ్ తన ట్విట్టర్ లో రాసుకున్నారు. అలాగే కృష్ణ వంశీ...నీ సినిమాకి ఈ టైటిల్ ఉపయోగిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేసి, శుభాకాంక్షలు చెప్పి మరీ ఈ టైటిల్ ను మాకు ఇచ్చారు అన్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. హన్సిక, స్వాతి ఖరారు కాగా నిషా అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మధ్య చాలా కథలు విన్నానని, అవన్నీ ఆల్రెడీ ఏదో ఒక సినిమాలో చూసినట్లుగానే అనిపించిందని, ఒక్క కందిరీగ కథ మాత్రమే వైవిద్యభరితంగా అనిపించిందని, అందుకే ఈ చిత్రం చేయడానికి ఓకే చేసానని రామ్ పేర్కొన్నారు. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పై ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.
1 comment:
It's OK..
Post a Comment