Monday, December 13, 2010

నాగార్జున రగడ-దిల్ రాజు గడగడ.....



‘గగనం’ సినిమాని నాగార్జున విడుదల చేయమంటే ‘బృందావనం’ విడుదలయ్యాక చేద్దామని దిల్ రాజు లింకు పెట్టాడు. కనీసం నవంబర్ లో అయినా విడుదల చేయాలంటే జనం ‘బృందావనం’ నుంచి ‘గగనం’ మీదకి దృష్టి మల్లిస్తే నష్టపోతానని నాగార్జునకి చెప్పుకున్నాడు. ఆ తర్వాత నాగర్జున ‘రగడ’తో దిల్ రాజుకి మెలిక పెట్టాడు.

రగడ విడుదలకి దగ్గరయ్యే కొద్దీ ఆ చిత్ర నిర్మాత శివప్రసాద్ రెడ్డి కంటే దిల్ రాజు ఎక్కువ టెన్సన్ ఫీలవుతున్నాడు. ఇప్పటికే సకాలంలో విడుదల కాక క్రేజ్ కోల్సోయిన తన సినిమా ‘గగనం’ భవిష్యత్తు మొత్తం రగడ మీదే ఆధారపడి ఉంది. ‘రగడ’ హిట్టయితే కనుక ఆ మోజులో గగనంని కూడా బయ్యర్లు కొనేస్తారు రగడ అటోఇటో అయితే మాత్రం దిల్ రాజు లాస్ మొత్తం భరించి సొంతంగా రిలీజ్ చేసుకోవాలి. అసలే ఎటు చూసినా కొత్త సినిమాల బెడద అన్ని నెలల్లోనూ తప్పేట్టు లేదు. దాంతో ఈ ప్రయోగం పూర్తిగా వికటిస్తుందని దిల్ రాజు వణుకుతున్నాడు. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన బృందావనంని విడుదల చేసేసుకున్న దిల్ రాజు త్వరలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కూడా విడుదల చేస్తున్నాడు. కానీ గగనం మాత్రం ఇంకా విడుదలయ్యే దారి కోసం కాచుకుని కూర్చుంది.

No comments: