రామ్ చరణ్ తేజ తాజాగా ఓ వెబ్ సైట్ పై విరుచుకుపడుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నేను చాలా ఆశ్చర్యపోయాను...కొన్ని ఆధారంలేని, స్టుపిడ్ రూమర్స్ ని ఓ వెబ్ సైట్ వారు రాసారని తెలిసికొని..వారిపై నేను తప్పని సరిగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఇక ఆ మద్యన కూడా సాక్షి ఛానెల్ తన సినిమా ఆరెంజ్ గురించి నెగిటివ్ గా ప్రసారం చేసిందని, అది ఓ ఇడియాటిక్ ఛానెల్ అని స్పందించారు. అయితే ఆ వెబ్ సైట్ ఏమిటన్నది మాత్రం రామ్ చరణ్ చెప్పలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్...మెరుపు చిత్రం చేస్తున్నారు. బంగారం దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. మరో ప్రక్క బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రామ్ చరణ్ ని ట్రై చేస్తున్నారు.
No comments:
Post a Comment