Tuesday, December 28, 2010

దర్శకునికి చుక్కలు చూపిస్తున్న రామ్ చరణ్...



‘ఆరెంజ్ అట్టర్ ప్లాప్ అయ్యేసరికి రామ్ చరణ్ డైలమాలో పడ్డటున్నాడు..మరీ మగధీరగా ఆడకపోయినా కనీసం యావరేజ్ అయినా అనిపించుకుంటుందని అనుకుంటే ‘ఆరెంజ్’ ఏకంగా కుళ్లిపోయింది. దాంతో తదుపరి చిత్రంతో డీసెంట్ హిట్ అయినా ఇవ్వాల్సిన భారం చరణ్ పై పడింది. లేదంటే మగధీర రాజమౌళి ఘనత అని, చరణ్ కి అంత సీన్ లేదని మీడియా ఈజీగా కల్సితాలు కల్పించేస్తుంది. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన ‘మెరుపు’ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి చరణ్ తాత్సారం చేస్తున్నాడు.

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రంపై చరణ్ కి నమ్మకం కుదరక పక్కకి పెట్టాడు. అయితే దానిని పూర్తి చేయడం తప్పదు కాబట్టి ఆ చిత్ర దర్శకుడు ధరణిని అదే పనిగా సతాయిస్తున్నాడు. సబ్జెక్ట్ విషయంలో పూర్తి భరోసా వచ్చాకే మళ్లీ షూటింగ్ కి వెళదామని, అవసరమైతే ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేసుకుందాం కానీ సెట్స్ మీదకి వెళ్లాక మాత్రం మళ్లీ ఆలోచనలో పడొద్దని చరణ్ ధరణికి చెప్పేశాడట. తమిళంలో వరుస ప్లాపులతో డీలా పడ్డ ధరణి తెలుగులో ఈ సినిమాతో హిట్టిచ్చి తన సత్తా చాటుకుందామని ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ కాన్ఫిడెన్స్ కోల్పోయిన చరణ్ అతడిని క్లారిటీ పేరుతో పీడించేస్తున్నాడు.

No comments: