Tuesday, December 28, 2010

నీలకంఠ కొత్త చిత్రం 'విరోధి' లో హీరో ఎవరంటే......


షో, సదా మీ సేవలో, మిస్సమ్మ,మిస్టర్ మేధావి, నందనవనం వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు నీలకంఠ. ఆయన మిస్టర్ మేధావి, నందనవనం చిత్రాలు ప్లాప్ అవటంతో దర్శకుడుగా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కమల్, వెంకటేష్ చిత్రం ఈనాడుకు డైలాగులు రాసారు. కానీ అనుకున్నంత పేరు..ఆ తర్వాత పని రాలేదు. అయితే రీసెంట్ గా ఆయన 'విరోధి' అనే టైటిల్ తో ఓ చిత్రం ఓకే చేయించుకున్నారు. శ్రీకాంత్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించనున్నారు. నక్సల్స్‌ నేపథ్యంలో ఉండే చిత్రమిది. శ్రీకాంత్ ఈ చిత్రంలో జర్నలిస్ట్‌ గా కనిపిస్తారు. 'రోజా' తరహాలో ఉంటుందీ చిత్రం. ఇక శ్రీకాంత్ తాజా చిత్రం రంగ..ది దొంగ ఈ వారమే విడుదల కానుంది.

No comments: