Monday, December 27, 2010

బాలయ్యకు దక్కకుండా అడ్డుపడింది సూపర్ స్టారే....


2010 సంవత్సరంలో విడుదలైన స్ట్రయిట్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళ కురిపించిన చిత్రంగా ‘సింహా’ నిలించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. కానీ ఈ సినిమాకంటే అత్యధిక వసూళ్ళు కురిపించిన చిత్రంగా రజనీకాంత్ ‘రోబో’ చిత్రం నిలిచింది. దాంతో ఈ యేడాది ఫస్ట్ ప్లేస్ రజనీకే దక్కింది. ఒకవేళ ‘రోబో’ ఈ యేడాది లేకపోయుంటే బాలయ్యకు ఫస్ట్ ప్లేస్ దక్కేదని, ‘పోకిరి రికార్డ్స్ ను సైతం ‘సింహా’ క్రాస్ చేసిందని పరిశీలకులు అంటున్నారు.

రజనీకాంత్ అడ్డుగా నిలవడం వల్లే బాలయ్య రెండో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని, లేకపోతే మొదటి స్థానం బాలయ్యదే అయ్యుండేదని మాట్లాడుకుంటున్నారు. కానీ స్ట్రయిట్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళు కురిపించినసినిమాగా ‘సింహా’ నిలిచింది కాబట్టి ఈ యేడాది మొదటి స్థానం బాలయ్యదేనని, ‘రోబో’ బడ్జెట్ ఎక్కువ, డబ్బింగ్ చిత్రం కావడంతో ఈ సినిమాకి మొదటి స్థానం కల్పించలేమని కూడా కొంతమంది వాదిస్తున్నారు.

1 comment:

Anonymous said...

ఒరే రాజేషూ...

నీకెంత బాలయ్య అభిమానం ఉంటే మాత్రం సింహాను అంత పైకెత్తాలా... దానికంత సీనులేదురా. పోకిరిని క్రాస్ చేసిందా...ఎవరైనా సినిమాఫీల్డు, రెవెన్యూ, కలెక్షన్ల గురించి తెలిసినవాళ్ళకు చెబితే నోటితో కూడా నవ్వరు. మొన్నేమో ఆరెంజ్ సంగీతం సో..సోగా ఉందని రాశావ్. ఇంత పక్షపాత వైఖరి పెట్టుకుని వెబ్ సైట్ పెట్టేబదులు బాలయ్య అభిమానినని వెబ్ సైట్ పెట్టుకో. బెటర్. రజనీ రోబో అయితే బాలయ్య బోబో. బోబోగురించి తెలియకపోతే గూగుల్ లో వెతుక్కో.