Sunday, December 19, 2010

మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ ?


సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన గూఢచారి 116 చిత్రాన్ని ఇప్పటికాలానికి అణుగుణంగా మార్చి కొద్ది పాటి మార్పులతో మహేష్ బాబు తో చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ప్రభాస్ తో చేసిన భిళ్లా తరహా స్టైలిష్ టేకింగ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని మెహర్ రమేష్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో శోభన్ బాబు చేసిన పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తే బావుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఆ పాత్ర చిత్రంలో గెస్ట్ గా వచ్చి చనిపోతుంది. హీరోయిజం పెద్దగా ఉండదు. దానిని కొద్దిగా మార్చి పవన్ ని అడగాలనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

అయితే క్యారెక్టర్ పరిధిని బట్టి కాకుండా ప్రాధాన్యతని బట్టి చేసే అవకాసం ఉందని పవన్ కి చెందిన వారు చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. అయితే స్క్రిప్టు వర్క్ పూర్తయిన తర్వాతే ఈ ప్రపోజల్ పెడదామని భావిస్తున్నారు. అనుకున్నట్లే అన్నీ జరిగితే పవన్, మహేష్ ఒకే పోస్టర్ పై కనపడటం ఫాన్స్ కు పండగే.

No comments: