Thursday, December 9, 2010

మన తెలుగు హీరోలు పరిక్ష రాస్తే ఎలా ఉంటుందో....సరదాగా చదివి నవ్వుకోండి....




రాత్రి కల్లో మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే  ..

మహేష్: ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

చీరంజీవి: థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్  అందుకుని)

రామ్ చరణ్: ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300 వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

సాయికుమార్: కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

బాలకృష్ణ: ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ  స్లిప్పో సరిగ్గా చెప్పండి.      

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

ప్రభాస్: వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

జూ|| యన్.టి.ఆర్ :  రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో ... లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు  ఇచ్చారా...అని  అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన వచ్చాడు రవితేజ )

రవితేజ: ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు.... నేనే...ఇచ్చా...! ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా అప్పడం. అందుకే  స్క్వాడ్ ను పిలిచా..! అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టు
 కోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన అందరు..


ఎట్టా ఉంది....

3 comments:

Anonymous said...

What is the miracle?Your blog has improved.Pop ups have reduced.Any ways good progress and nice write up also.Keep it up.

ఆ.సౌమ్య said...

సూపర్ సూపర్ :)))

Admin said...

Super, Chala Baaga Rasaru.