Tuesday, December 21, 2010

కొడుకు సినిమాకు బ్రహ్మానందం పాట్లు...........



తన కొడుకు గౌతమ్ సినిమా ప్రమోషన్ కోసం బ్రహ్మానందం పడరాని పాట్లు పడుతున్నాడు. తను నటించిన సినిమాల ప్రమోషన్కే వెళ్ళని బ్రహ్మానందం కొడుకు విషయానికొచ్చేసరికి ప్రమోషన్ అవసరమైంది. అందుకే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయాలనుకొని అగ్రకధానాయకులను పిలిచిమరీ ఆడియో ఫంక్షన్ నిర్వహించాడు. ఆయన కొడుకు గౌతమ్ హీరోగా నటించిన వారేవా చిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీని కే.రాఘవేంద్రరావు ఆవిష్కరించి తోలి ప్రతిని నాగార్జునకు అందజేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు తండ్రిగా నేనెంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. ఆ సమయంలోనే తోటి హీరోలందరూ ఫోన్ చేసి మరీ నాకు ధైర్యం చెప్పారు.మా మధ్య ఎంత పోటీవాతావరణం వున్నా పిల్లలవిషయంలో మాత్రం అందరం సక్సెస్ కావాలనే కోరుకుంటాం. అందుకే చిరంజీవి తరుపున, బాలకృష్ణ తరుపున, మోహన్ బాబు తరుపున, వెంకటేష్ తరుపున బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ 'హీరోగా ఎదగాలనుకునేవాడు గోప్పనటుడై వుంటే సరిపోదు. గొప్ప వ్యక్తి అయి వుండాలి. నేను హీరో కాకముందు నాన్నగారు నాతో తరుచూ ఈ మాట అంటుండేవారు. నేను చేసిన మూడు సినిమాల్లో బ్రహ్మానందం గారితో చేసాను. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన తనయుడు గౌతమ్ నటించిన ఈ చిత్రం తప్పక విజయం సాధించాలి' అన్నారు.

గౌతమ్ తన క్లాస్మేట్ అని, శ్రమించేతత్వం వున్న గౌతమ్ తప్పకుండా సక్సెస్ సాధిస్తాడని నాగ చైతన్య ఆశాభావం వ్యక్తంచేసారు.

ఇంకా విష్ణు, మనోజ్, రాణా, దిల్ రాజు, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, గౌతమ్, సంభవి, కోన వెంకట్, కే.బి.రెడ్డి, మధుర శ్రీధర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments: