Wednesday, December 22, 2010

వరుణ్ కి కుదిరితే కప్పుకాఫీ కుదరకపోతే గ్లాస్ బీరట...


తెలుగు సినీ పరిశ్రమ మొత్తంలో ఎవరికీ అంతు పట్టని ఒకే ఒక భేతాళ ప్రశ్న హీరో వరుణ్ సందేశ్. గత జన్మ(సంవత్సరం)లో ఎప్పుడో రెండు హిట్స్ ఇచ్చాడని ఇంకా మన నిర్మాతలు ఈ టింగరి హీరోని నమ్ముకుని సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారంటే వారిది అజ్ఝానమో?అవివేకమో? తెలియట్లేదు. అయినా ఈ ‘కుర్రాడు’ మాత్రం ఎంచక్కా ‘హ్యాపీ హ్యాపీ’గా ప్లాపులు మీద ప్లాపులు ఇచ్చుకుంటూ ప్లాపుల్లో సరికొత్త ‘మరో చరిత్ర’ సృష్టిస్తున్నాడు.

ఓ నెల క్రితం విడుదలైన ‘ఏమైంది ఈవేళ’ కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాకుండా వెళ్లిపోయింది. ఇంతటి దారుణ చిత్రాల నడుమ కూడా వరుణ్ బాబుని వెతుక్కుంటూ ‘కుదిరితే కప్పు కాఫీ’ తీసుకొస్తున్నారు. మూన్ వాటర్ ఫిల్మ్ అధినేతలు. సినిమాలలో, లోపలి తతంగం తెలిసిన వాళ్లయితే ఏముంది వరుణ్ కి ఇది అలవాటే సినిమా హిట్టయితే ఓ కప్పు కాఫీ తాగేస్తాడు..లేక ప్లాపయితే ఓ గ్లాస్ బీరు తాగేసి అంతా మర్చిపోతాడంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు.

1 comment:

Anonymous said...

entha correct ga chepprandi.. naku kuda ennalla nundo ide doubt.. asalu varun meeda e nammakam pettukuni cinema teestaru ani...