Thursday, December 23, 2010

నాగవల్లి రివ్యూలు చూసి జడుసుకున్నబాలీవుడ్ స్టార్ హీరో



వెంకటేష్, పి.వాసు కాంబినేషన్ లో రూపొంది ఈ శుక్రవారం విడుదలైన నాగవల్లి చిత్రం యావరేజ్, బిలో యావరేజి అంటూ రివ్యూలు వచ్చాయి. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్న సల్మాన్ ఖాన్ డైలమోలు పడ్డారు. ఈ చిత్రం రివ్యూలు కంగారుగా చూసిన ఈయన రిజల్ట్ చూసి జడుసుకుని ఈ ప్రయత్నం మానుకుందామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో అక్షయ్ కుమార్..చంద్రముఖి చిత్రం రీమేక్ భూల్ భులయ్యా ని చేసి హిట్ కొట్టారని సల్మాన్ ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపారు.

ఇందునిమిత్తం పి.వాసుతో కూడా చర్చలు జరిపారు. ఇక సల్మాన్ ఖాన్ పోకిరీ రీమేక్ వాంటెడ్ ని ప్రభుదేవా దర్శకత్వంలో చేసినప్పటినుంచి ఆయన దృష్టి సౌత్ సినిమాలపై పడింది. ప్రస్తుతం తెలుగులో హిట్టయిన రెడీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అలాగే బాడీ గార్డ్ చిత్రాన్ని సైతం సల్మాన్ ఖాన్ రీమేక్ చేయటానికి రెడీ అయ్యారు. మరో ప్రక్క రవి తేజ కిక్ చిత్రం రైట్స్ ని సైతం తీసుకున్నారు

No comments: