కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు అదుపు తప్పిన శరీరంతో ఇండస్ట్రీకి దూరమైన రాశి ఆ మధ్యన పెళ్ళి చేసుకుని సెటిలైంది. తన భర్త శ్రీనివాస్ దర్శకత్వంలో మహారాజశ్రీ అనే చిత్రం నిర్మించింది. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలి ఆమె డబ్బుకు చెదపట్టించింది. దాంతో ఆ తర్వాత ఆమె ధైర్యం చేసి మరో చిత్రం తీసింది కానీ అదీ వర్కవుట్ కాలేదు. దాంతో ఆమె ఇప్పుడు స్వీట్స్ బిజెనెస్ లోకి దిగాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ లో భారీ ఎత్తున ఓ స్వీట్ హౌస్ ఓపెన్ చేయాలని చూస్తోంది. ఆమెకు ఉన్న పరిచయాలుతో ఈ వ్యాపారం బాగా రన్ అవుతుందని భావిస్తోంది.
No comments:
Post a Comment