తెలుగు చిత్ర పరిశ్రమ కష్టనష్టాలన్నీ తీర్చి, ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు టాలీవుడ్ పెద్దలంతా ఏకమై సుదీర్ఘంగా రోజుల తరబడి చర్చించుకుంటున్నారు. మన పరిశ్రమని పునరుద్ధరించడానికి, మరింత పైకి తీసుకెళ్లడానికి ఏం చేయాలనే దానిపై వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా డబ్బింగ్ సినిమాలతో వస్తున్న ఇబ్బందుల గురించి పలువురు ప్రస్తామించారు. డబ్బింగ్ సినిమాలని తెలుగులో నిషేదించాలని వారంతా ప్రతిపాదించారు.
అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మన సినిమాల పరిమాణాలు పెంచుకోవడం చేతకాక వేరే భాషల చిత్రాలను నిషేదించాలనడమేంటని సూటిగా ప్రశ్నించాడు. అతని ప్రశ్నతో ఆ ప్రతిపాదన చేసిన వాళ్లంతా అవాక్కయ్యారు. కర్ణాటకలో అనువాద చిత్రాలను నిషేధించారంటే వారి సినిమా పరిమాణాలు చాలా అల్పమని, అందుకే ఉన్నతంగా అనిపించే ఇతర భాషల చిత్రాలను అనువదించడం అక్కడ నిషేదించారని, మనం కూడా అలానే మనల్ని మనం అభివృధ్ధి చేసుకోలేమనుకుంటే నిషేధించుకోవచ్చని పవన్ తనదైన రీతిలో మాట్లాడ్డంతో ఆ ప్రతిపాదన చేసిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. మన సినిమాల పరిమాణాలు పెంచుకోలేక వేరే భాషల చిత్రాలను అడ్డుకోవడం తగదనే పవన్ వాదనతో దాదాపు అక్కడున్నవారంతా ఏకీభవించారు.

2 comments:
పరిమాణాలు కాదు ప్రమాణాలు.
nijame kada .. chetakakapote kadu ani cheppali kani .. manchi vishyalani dache prayatnam chestaraa .. mana cine industry siggu pade lanti prasna vesadu powerstar .. :) nenu atani fan kakapoyina i appreciate him
Post a Comment