Saturday, January 1, 2011
రామ్ చరణ్ సినిమాని రిజెక్టు చేసిన ఇలియానా......
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చేయాలని చాలా మంది హీరోయిన్స్ ఉవ్విళ్ళూరుతూంటారు. ఎందుకంటే క్రేజ్ ఉన్న హీరో, పెద్ద బడ్జెట్, స్టార్ డైరక్టర్ ఉంటారని. అయితే తాజాగా ఇలియానా..చరణ్ తాజా చిత్రం మెరుపుని రిజెక్టు చేసిందని తెలిసింది.అయితే దానికి కారణం ఆ చిత్రంలో ఇప్పటికే కొంత భాగం చేసిన కాజల్..డేట్స్ ప్లాబ్లం అని తప్పుకుంది. మరో ప్రక్క జెనిలియాపై ఆరెంజ్ వివాదంలో కామెంట్స్ చేయటం కూడా ఇలియానాని ఆలోచనలో పడేసిందిట. అయితే మెరుపులో గెస్ట్ పాత్ర కోసం అడిగారని అందుకే కాదనుకుందని మరో వాదన వినపడుతోంది. అదేమీ కాదని కాజల్ తప్పుకుంది కాబట్టి ఆ పాత్ర ఇలియానా చేస్తే బావుంటుందనే దర్శకుడు ధరణి భావించి అడిగాడని, డేట్స్ క్లాష్ అవుతాయని చెప్పి ఇలియానా తప్పుకుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్. 'శక్తి'లోను, రానా 'నేను నా రాక్షసి'లోను హీరోయిన్ గా చేస్తోంది. అలాగే త్రీ ఇడియట్స్ రీమేక్ లో శంకర్ దర్శకత్వంలో చేయటానికి కూడా కమిటైంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment