‘పోకిరి’ కాంబినేషన్లో మరోసారి రిపీట్ అవుతోంది. మహేష్ హీరో గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రంగురించి మహేష్ మాట్లాడుతూ- పూరీ జగన్నాథ్ చెప్పిన సబ్జెక్టు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. మళ్లీ మా కాంబినేషన్లో ఇది ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- కథ విని మహేష్ బాగా ఇన్స్పైర్ అయ్యారు. పోకిరి తర్వాత మా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం మళ్లీ కొత్త రికార్డు సృష్టిస్తుందని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ మహేష్, పూరీల కాంబినేషన్లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో మా సంస్థపై చాలా ప్రెస్టీజియస్‌గా చిత్రాన్ని రూపొందిస్తాం. మేలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం మహేష్...శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నారు. ఇక పూరీ జగన్నాధ్...రానా హీరోగా నేనూ నా రాక్షసి చిత్రం రూపొందించి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

1 comment:
all the best mahesh :-)
Post a Comment