
'కళ కళకోసం కాదు ప్రజల కోసం' అనే నానుడి ఎంత సత్యమో, సమాజ హితం కోసం సినిమా మాద్యమం ఎంతటి మహత్తరమైన పాత్ర నిర్వహించగలదో 'నోవన్ కిల్డ్ జెస్సికా' సినిమా నిరూపించింది. యుటివి పతాకంపై నిర్మించిన ఈ చిత్రం న్యాయం కోసం చేసే పోరాటంలో ప్రసార మాధ్యమం(ఎలక్ట్రానిక్ మీడియా) ప్రజలను చైతన్యం చేయడం కోసం నిర్వహించిన పాత్ర చాలా ఆదర్శవంతమైంది. ఆచరణీయమైంది.

కొడుకు నిర్దోషిగా బయటపడేటట్లు చేస్తాడు. వాస్తవం తెలిసిన టివి జర్నలిస్ట్ ఒకామె పట్టుదలతో తన యాజమాన్యాన్ని ఒప్పించి జెస్సికా కేసు తిరగదోడుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి అనేక రూపాలలో ఉద్యమాన్ని నడిపిస్తుంది. ప్రజా ఉద్యమానికి తలొగ్గి జెస్సికా కేసును కోర్టు తిరిగి స్వీకరిస్తుంది. పునర్విచారణ జరిపి హంతకుడికి యావజ్జీవ శిక్ష, అతని అనుచరులకు నాలుగేళ్ల ఖైదు విధించడం ద్వారా సినిమా ముగుస్తుంది.
న్యాయవ్యవస్థలో వున్న లొసుగులను, న్యాయాన్ని కొనుక్కునే తీరును కళ్లకు కట్టినట్లు ఈ సినిమా బహిర్గతం చేస్తుంది. కేసును నీరుగార్చిన అదే సాక్షుల ద్వారా నిజాన్ని చెప్పించడానికి అనుసరించిన పద్ధతులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దోషులకు శిక్ష పడేటట్లు చేయడాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సీరియస్ కథ అయినా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జర్నలిస్ట్‌గా రాణి ముఖర్జీ, జెస్సికా సోదరిగా విద్యాబాలన్ పాత్రలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఇద్దరి నటన అద్భుతంగా ఉంది. కొన్ని సందర్భాలలో జర్నలిస్ట్ పాత్ర ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉన్నా వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది.

నీరారాడియా ఉదంతం, ప్రసార మాధ్యమంలో పనిచేస్తూ కార్పొరేట్ సంస్థల తాబేదార్లుగా వ్యవహరిస్తున్న పాత్రలను బట్టయలు చేస్తున్న నేపథ్యంలో... ప్రజల న్యాయ పోరాటానికి నాయకత్వం వహించే పాత్రను ఒక జర్నలిస్టు పోషించడం నాణేనికున్న రెండవ కోణాన్ని ఆవిష్కరించినట్లైంది. ప్రత్యేకించి అనేక అసమానతలకు, అన్యాయాలకు గురౌతున్న మహిళలను చైతన్య పరచడంలో 'నోవన్ కిల్డ్ జెస్సికా' సఫలీకృతమైంది. అందరూ ఆదరించదగిన మంచి సినిమా ఇది.
No comments:
Post a Comment