మిరపకాయ్' ఒక టిపికల్ రవితేజ బ్రాండ్ మాస్ మసాల సినిమా. రవి తేజ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా సంక్రాంతి కానుకే. కాకపోతే వెరైటి, కొత్తదనం కోరుకునే రెగ్యులర్ సినిమా లవర్స్ కు మాత్రం ఒక రొటీన్ కమర్షియల్ ఫార్ముల సినిమా ఇది. గత కొన్ని చిత్రాల నుండి రవితేజ కూడా తన కంటూ ఒక మూస ధోరణి ని ఏర్పరుచుకుంటూ తన చుట్టూ తెలియకుండానే ఓ గిరి గిసుకుంటున్నాడు. రవితేజ కూడా మొదట్లో వైవిధ్య మైన పాత్రలలో నటించబట్టే ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు అన్న విషయాన్ని గమనించవలసి ఉంది. మిరపకాయ్ విషయానికి వస్తే కిక్ సరిపోలేదు అనే చెప్పాలి. దర్శకుడిగా హరీష్ శంకర్ మంచి మార్కులే వేయించుకున్నా కధ కు అనుగుణంగా కధనాన్ని మలచడంలో ఎవరేజ్ మార్కులతో సరిపెట్టుకున్నాడు. ఒక ఆసక్తికరమైన పాయింట్ ను ఎంచుకుని, దాన్ని పక్కన పెట్టి వినోదంకోసం కధనాన్ని పక్కదారులు పట్టించాడు. దాంతో అసలు విషయం చప్పబడి మిరపకాయ ఒక మాములు సినిమాగా సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇక హీరో రవితేజ 'మాస్ రాజా' నుండి 'మాస్ మహా రాజా'గా ఎదిగాడు. తనదైన శైలి నటనతో సినిమాలో ప్రతి విభాగానికి అందం తెచ్చాడు. పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగ్ తో, అదరగొట్టే స్టెప్పులతో, ఊపు తెప్పించే ఫైట్స్ తో తన భాద్యతను తను నిర్వర్తించాడు. ఈ సినిమాలో పెద్ద కామెడీ ఆర్టిస్టులు ఎవరూ లేక పోవడంతో ఆ భాద్యత కూడా తనే భుజాలకు ఎత్తుకుని నవ్వించాడు. రిచా, దీక్ష లకు మంచి పాత్రలే లబించాయి. నటనవరకే అనుకుంటే ఈ ఇద్దరు భామలు డ్యాన్స్ కూడా సరిగా చేయలేకపోతున్నారు. చివరికి తెలుగు సినిమాలో హీరోయిన్ కావాలంటే తెల్లతోలు ఉంటే సరిపోతుందేమో...? అని అనిపిస్తుంది. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ తమ సహజ దోరణిలో నటించి ఆలరించారు. మిగతా పాత్రలు తమ పరిదిమేర బాగానే నటించారు. సంగీత దర్శకుడు తమన్ పాటలు, బ్యాక్ స్కోరు పర్వాలేదు అని పించేలా ఉన్నాయి. కాకపోతే రగడ, మిరపకాయ్ రెండు ఒకేసారి చేయటం మూలంగా అనుకుంటా కొన్ని పాటల్లో రగడ గుర్తుకు వస్తూ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:
- కొంటె మాటలతో, చిలిపి అల్లరి తో, పవర్ ఫుల్ ఎనర్జీ తో రవితేజ మిరపకాయ్ సినిమాని ఒంటి చేత్తో నడిపించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రవితేజ ఒన్ మ్యాన్ షో ఈ మిరపకాయ్. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్.
- రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.
మైనస్ పాయింట్స్:
మూస కధనం, రొటీన్ క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్స్.

No comments:
Post a Comment